Agripedia

పీతల సాగుకు అనువైన చెరువుల నిర్మాణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

KJ Staff
KJ Staff

అధిక సముద్ర తీరరేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్వా రంగ ఉత్పత్తుల్లో భారత దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో సాగయ్యే ఆక్వా ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న సన్న, చిన్నకారు ఆక్వా రైతులు చేపలు,రొయ్యలతోపాటు ఉప్పునీటి పీతల సాగుపై కూడా ఆసక్తి చూపుతూ అధికంగా ఉత్పత్తి చేస్తు సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.

పచ్చపీతలకు స్థానిక మార్కెట్లోను,విదేశీ మార్కెట్లల్లో డిమాండ్ను బట్టి కిలో 1500 రూపాయల వరకు పలుకుతోంది. దాంతోపాటు పచ్చ పీతలు 36 నుండి 48 గంటలు నీరు లేకుండ బ్రతకగలవు దీంతో విదేశీ మార్కెట్లకు బతికున్న పీతలను ఎగుమతి చేయడం వల్ల అధిక లాభాలను సమకూరుతోంది. పీతల పెంపకం లో అధిక లాభాలు పొందాలంటే నాణ్యమైన విత్తనాలను సేకరించడంతో పాటు , పీతల చెరువు తయారీలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి అవసరం ఎంతైనా ఉంటుంది.

చెరువుల తయారీ విధానం :

సహజంగా రొయ్యల చెరువుల తయారీ విధానమే పీతల సాగులో కూడా అవలంబించాలి. కాకపోతే పీతలు ఉభయచర జీవులు కావున చెరువు గట్ల మీద నుండి మరియు చెరువు గట్లకు రంధ్రాలు చేసుకొని బయటకు వెళ్ళిపోతాయి. కావున పీతల చెరువుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పీతల చెరువులు 0.5 ఎకరం నుండి 2.5 ఎకరాలు విస్తీర్ణం గల ఉప్పునీటి చెరువులు అనుకూలంగా ఉంటాయి.

ముందుగా చెరువులో నీటి మట్టం 4 అడుగులు నిలువ ఉండేలా గట్లు ఎత్తు ఏర్పాటు చేసుకుని చెరువు గట్టుమీద 3 అడుగుల ఎత్తులో సర్వి కర్రలతో,వెదురు కర్రల సహాయముతో వెదురు తడికెలు గాని నైలాన్ వలను గాని, వాడిన పాలిథిన్, ఐరన్ వలను కట్టిన తర్వాత వాడిన పాలిథీన్ ముక్కలతో 0.40 మీ. ఎత్తువరకు కట్టవలెను దీని వలన పీతలు చెరువు నుండి బయటకు తప్పించుకోలేవు.

ఇసుక మరియు బంక మట్టితో కలిసి నీరు అధికంగా నిలువ ఉండే భూములు అయితే పీతల సాగు లో ఖర్చు బాగా తగ్గుతుంది. అలాగే చెరువులను నీటితో నింపడానికి , ఖాళీ చేయడానికి సులువుగా రెండు గేట్లను ఏర్పాటు చేసుకోవాలి. పీతలను పట్టుకునేటప్పుడు శ్రమ తగ్గుతుంది.మరియ చెరువుల్లో సరైన సమయంలో నీటిని మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More