కూరగాయల సాగు నిర్వహించడం మిగితా పంటలతో పరిగణిస్తే చాల సులభం, వీటి సాగుతో సన్న,చిన్నకారు రైతులు తక్కువ ఖర్చు,శ్రమతో మరియు తక్కువ సమయంలో చాలా ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా టమాటా ,మిరప ,బెండకాయ,వంకాయ,చిక్కుడు,గోరుచిక్కుడు,దోసకాయ,కాలీఫ్లవర్ మరియు క్యాబేజీలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ రకాల ఆకుకూరలను కూడా పండిస్తున్నారు.
క్రింద వివరించిన సూచనలతో ఖర్చును తగ్గించి అధిక లాభాలను గడించవచ్చు.
టమాట తోటలో సమగ్ర సస్య రక్షణ:
*టమాటలో ఆకు మాడు తెగులు ఆకు ఎండు తెగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది వీటి నివారణకై అజాక్సిస్ట్రోబిన్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
*రసం పీల్చే పురుగుల నివారణకై 2 మీ.లీ పిప్రోనిల్ ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి
*టమాటా తోటలో బంతిపూల మొక్కలను అక్కడక్కడ పెంచినట్లయితే శనగపచ్చ పురుగుకి ఇది ఎరగా మారుతుంది.
మిరపలో సమగ్ర సస్య రక్షణ:
*నారు వేసే ముందు మిరపలో ఇమిడాక్లోఫ్రిడ్ తో విత్తన శుద్ధి చేసినట్లయతే రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు.జిగురు కార్డులను వినియోగించడం ద్వారా కూడా వీటిని అదుపులో పెట్టవచ్చు
*బూడిద తెగులు నివారణకు 2 మీ.లీ ల డైనోకాప్,కాయతొలుచు పురుగు నివారణకు 1 గ్రాము థయోడియోకార్ప్ ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి
*ఎర్రనల్లి నివారణకు 1.5 మీ.లీ ల స్పైరోమెసిఫిన్, తామర పురుగుల నివారణకు 0.3 మీ.లీ ల ఇమిడాక్లోప్రిడ్ ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి
తీగజాతి కూరగాయలలో సమగ్ర సస్య రక్షణ:
*తీగ జాతి కూరగాయల ప్రారంభ దశలో పెంకు పురుగుల దాడి ఎక్కువగా ఉంటుంది దీని నివారణకై 2 మీ.లీ ల క్వినాల్ ఫాస్ ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
*రసం పీల్చే పురుగుల నివారణకు 5 మీ.లీ ల వేప నూనెని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల నియంత్రించవచ్చు
*పంటలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకున్నట్లు అయితే పండు ఈగలను దారి మళ్లించవచ్చు
*నత్రజని ఎరువులని మోతాదుకు మించి వాడరాదు లేనియెడల పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
*ముఖ్యం గా తీగజాతి కూరగాయల్లో గంధకానికి సంబందించిన మందులను వాడరాదు.
ఇంకా చూడండి
Share your comments