సాదారణముగా రైతులు కీటక నాశునులను తీసుకొని వచ్చినప్పుడు వాటి పై 4 ప్రధాన రంగులతో కూడిన జాగ్రత్త గుర్తు లు ఉంటాయి , అయితే రంగును బట్టి పురుగుమందు స్వభావం తెలియజేసే గుర్తుల గురించి ఎక్కడ తెలుసుకుందాం !
పురుగుల మందు పిచికారీ చేసేటప్పుడు రైతు తీసుకోవాల్సిన జాగ్రతలు :
ఆహార పదార్థాలతో పాటు కీటనాశక మందులను రవాణా చేయరాదు
పురుగుల మందు నిల్వచేసే గదిని తాళం వేసి భద్రపరచండి.- పిల్లలకు అందకుండా ఉండే చోట నిల్వచేయాలి.
- అసలైన ప్యాకింగులతోనే కీటకనాశని మందులను కొనండి.
- ఉపయోగించే ముందు లేబులును, వివరాల పత్రాన్ని పూర్తిగా చదవండి.
- రక్షణ కల్పించే వస్త్రాలను ధరించండి.
- సిఫారసు చేసిన పరిమాణాన్ని సరిగా కొలిచి తీసుకొనండి.
- నీటితో కలిపేటప్పుడు కర్రతో బాగా కలియబెట్టండి.
- చిందకుండా ఉండటానికి గరాటును ఉపయోగించండి.
- గాలి వీచే దిశలోనే పిచికారీ చేయండి.
- నాజలు శుభ్రపరచడానికి నోటితో గాలిని ఊదకండి.
- పిచికారీ చేసేటప్పుడు తినకండి,
- తాగకండి, పొగ తాగకండి.
- చిల్లుపడిన, పాదయిన స్ప్రేయరును లేదా డస్టరును వాడకండి.
- పిల్లల చేత పిచికారీ చేయించవద్దు
- మందు చల్లుతున్న ప్రదేశముల వద్ద
- మందు చల్లుతున్న ప్రదేశముల వద్ద ఆహార పదార్థాలను ఉంచవద్దు
తినే ముందు, తాగే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
ప్రమాదవశాత్తూ విష ప్రభావం కలిగితే, ప్రాథమిక చికిత్స చేసి డాక్టరుకు కు కీటకనాశని మందు డబ్బా వివరాల కరపత్రాన్ని చూపండి. -
ఈ వారం పాడి పంటల సమగ్ర సమాచారం .. పాటించవలసిన జాగ్రత్తలు & సూచనలు ...
జాగ్రతలు :
- వెంటనే మంచి వైద్యచికిత్స చేయించండి.
- ఖాళీ డబ్బాలను విరగగొట్టి "భూమిలో పాతిపెట్టండి.
- మందు చల్లడం పూర్తయిన తరువాత స్నానం చేయండి. దుస్తులను ఉతకండి
పురుగు మందు గుర్తుల వివరణ :
- ఎరుపు రంగు - అత్యంత విషపూరితమైనవి .
పసుపు -విషపూరితమైన .
నీలం - మధ్యస్థ విషపూరితమైనవి .
ఆకుపచ్చ -తక్కువ విషపూరితమైనవి .-
ఈ వారం పాడి పంటల సమగ్ర సమాచారం .. పాటించవలసిన జాగ్రత్తలు & సూచనలు ...
Share your comments