Agripedia

ఈ వారం పాడి పంటల సమగ్ర సమాచారం .. పాటించవలసిన జాగ్రత్తలు & సూచనలు ...

Srikanth B
Srikanth B
Comprehensive information on major crops this week
Comprehensive information on major crops this week

ఈ వారం పాడి పంటల సమగ్ర సమాచారం .. పాటించవలసిన జాగ్రత్తలు & సూచనలు ...

ఈ వారం అనగా తేదీ 29-12-2022 నుంచి 04-01-2023 వరకు తెలంగాణ వ్యాప్తముగా వాతావరణం , పంటల సాగు , పంటలకు ఆశించే పురుగులు మరియు తెగుళ్లు వాటి నివారణ ,రైతులు తీసుకోవాల్సిన జాగ్రతలు వంటి సమగ్ర సమాచారం క్రింద ఇవ్వబడినది .

 

 

ఈవారం వాతావరణం & వర్షపాతం సమాచారం :

యాసంగి పంట కాలం లో తెలంగాణ రాష్ట్రము పై ఈశాన్య ఋతుపవనాల ప్రభావం అధికంగానే ఉంటుంది . రాష్ట్ర సగటు వర్షపాతంలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 14 % వర్షం కురుస్తుంది . అయితే ఈ వారం లో సగటుగా 0. 9 % వర్షం ఈశాన్య ఋతుపవనాల ద్వారా పొందాల్సి ఉండగా .. ఈవారం 0. 0 % వర్షం పాతం నమోదయింది .

రాష్ట్రము లో విత్తన సాగు వివరాలు ;

గత యాసంగి పంట కాలం లో తెలంగాణ రాష్ట్రము తేదీ 29-12-2022 నుంచి 04-01-2023 మధ్య 47. 85 లక్షల ఎకరాలలో పంట సాగు అవ్వగా ఈ యాసంగి ఇప్పటివరకు కేవలం 12. 39 లక్షల ఎకరాలలో పంట సాగు జరిగింది .

వరి ,నువ్వులు , పెసలు:
ఇప్పటి వరకు వరి ,నువ్వులు , పెసలు సాగు మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల్,సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, హనుమకొండవరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్,జనగాం, ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి,మేడ్చల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి,నల్గొండ, సూర్యపేట మరియు యాదాద్రి లో 25 % వరకు సాగు అయ్యింది .


గోధుమ, జొన్న లు :

గోధుమ, జొన్న ల సాగు 26-50 % వరకు నిజామాబాద్ మరియు గద్వాల్, జిలాలలో పూర్తయింది .

వేరుశెనగ మరియు పొద్దుతిరుగుడు, పొగాకు:

వేరుశెనగ మరియు పొద్దుతిరుగుడు, పొగాకు సాగు 71% వరకు ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, వికారాబాద్ మరియు
నాగర్ కర్నూల్ జిలాలలో పూర్తయింది .

పొద్దు తిరుగుడు :

ఆదిలాబాద్ జిల్లాలో 100 % పొద్దు తిరుగుడు సాగు పూర్తయింది.

ఎండు కొబ్బరికి MSP మద్దతు ధరకు కేంద్రం ఆమోదం !

ఈ వారం లో పంటను ఆశించే పురుగులు మరియు తెగుళ్లు :

వరి - మొక్క ఎదిగే దశ - ఆశించే పురుగు కాండం తొలుచు పురుగు - ప్రభావిత జిల్లాలు : మెదక్ ,వరంగల్ ,ఖమ్మం

మొక్క జొన్న - సంపూర్ణంగా ఎదిగిన దశ - ఆశించే పురుగు కత్తెర పురుగు - ప్రభావిత జిల్లాలు ; నిర్మల్ . వరంగల్ ,కామారెడ్డి


మెరుగైన సలహాల కోసం కిసాన్ కాల్ సెంటర్ ను సంప్రదించండి ; 1800-180-1551

ఎండు కొబ్బరికి MSP మద్దతు ధరకు కేంద్రం ఆమోదం !

Share your comments

Subscribe Magazine