Agripedia

జాజికాయ, జాపత్రి. ఎలా వస్తాయో మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆహారాల్లో బిర్యానీ కూడా ఒకటి. దీనినే కొన్ని చోట్ల పలావ్ అని కూడా అంటారు. బిరియాని తయారీలో ఎన్నో రకాల మసాలాలు మరియు సుగంధ ద్రవ్యాలు వాడటం వలన దీనికి ఇంత టేస్ట్ వస్తుంది. బిరియాని లో వాడే మసాలా దినుసుల్లో జాజి పువ్వు మరియు జాజిపత్రి ఒకటి. అయితే ఎప్పుడైనా ఇవి ఎక్కడి నుండి వస్తాయన్న సందేహం మీకు వచ్చి ఉంటె ఈ ఆర్టికల్ మీ కోసమే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

జాజిపువ్వు మరియు జాజికాయ అనేక వంటకాల్లో, మసాలా తయారిలో వినియోగిస్తారు. అయితే మనం అంత ఇవి రెండు వేర్వేరు అనుకుంటాం. కానీ జాజిపువ్వు మరియు జాజికాయ ఒకే చెట్టు కాయలోనివి. మిరిస్టికే ఫ్రేగ్రెన్స్ అనే చెట్టు యొక్క కాయ నుండి వీటిని సేకరిస్తారు. మన దేశంలో ఈ చెట్లు కేరళ పప్రాంతంలో ఎక్కువుగా పెరుగుతాయి. ఈ చెట్టుకు కాసే కాయ లోపలి గింజ భాగాన్ని జాజికాయగాను, మరియు గింజ పైన భాగాన్ని జాజిపువ్వుగా మన వాడుక భాషలో ఉపయోగిస్తాం.

జాజిపువ్వులు, జాజికాయల సాగు:

జాజి చెట్లు ఇండోనేషియా ప్రాంతానికి చెందినవి. వీటిని తమిళనాడు, కేరళ ప్రాంతంలోని రైతులు ఎక్కువుగా పండిస్తారు. ఇక్కడి నుండి భారత దేశమంతటా జాజిపువ్వు, జాజికాయలు ఎగుమతి జరుగుతుంది. ఇక్కడ పండిన ఈ సుగంధ ద్రవ్యాలకు ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది, పైగా మిగిలిన దేశాలతో పోలిస్తే మన రైతులు తక్కువ ధరకే వీటిని విక్రయిస్తారు కనుక ఎక్కువమంది కొనేందుకు ఆసక్తి చూపుతారు.

వీటిని సాగుచేయడం కోసం, జాజిచెట్లకు కాసిన కాయలను, పండే వరకు చెట్టు మీదనే ఉండనివ్వాలి. కాయలు బాగా పండిన తర్వాత కాయ రెండు భాగాలుగా చీలుతుంది, ఇటువంటి కాయల నుండి మాత్రమే జాజిపువ్వును, జాజికాయలను సేకరించాలి. మార్కెట్లో జాజికాయల కంటే జాజిపువ్వులకే ధర ఎక్కువ, అంతే కాకుండా జాజిపువ్వులు ఎంతో అల్పంగా ఉంటాయి, కనుక వీటిని సేకరించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.

 

వీటిని సేకరించడంలో అనుభం ఉన్నవారిని మాత్రమే ఈ పనికి నియమించాలి. జాజిపూలను, కాయలను వేరు చేసిన తరువాత వీటిలో నీరు ఆరిపోయేవరకు ఎండబెట్టాలి. ఇలా ఎండిన కాయలను, పూవులను నాణ్యతను బట్టి విభజించి మార్కెట్లో విక్రయిస్తారు.

మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉండటానికి చాల కారణాలు ఉన్నాయి. ముందుగా ఈ చెట్లను అన్ని ప్రాంతాల్లో సాగుచెయ్యడం సాధ్యం కాదు. రెండవది ఈ కాయలు పండి చెట్టు నుండి రాలక ముందే సేకరించాలి, లేదంటే వీటి మీద ఫంగస్ పెరిగి, విక్రయించాడనికి వీలు లేకుండా పోతుంది.

Share your comments

Subscribe Magazine