Agripedia

నవధాన్యాల సాగు..... మీ భూమికి బాగు.....

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో రైతులు అధిక దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో, అధిక మొత్తంలో ఎరువులు వినియోగిస్తున్నారు, ప్రభుత్వం ఎరువుల మీద భారీగా సబ్సిడీ కల్పిస్తున్నందున వీటి వినియోగదారుల సంఖ్యా కూడా భారీగానే ఉంది. అధిక మొత్తంలో ఎరువులు వినియోగించడం ద్వారా భూమిలోని సారం తగ్గిపోతూవస్తుంది. భూమిలోని ఇప్పటికే భూమిలోని కర్బన శాతం ఉండాల్సిన స్థాయికంటే తక్కువగా ఉన్నట్లు శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. భూమిలోని కర్బన శాతాన్ని పెంచి, భూమిని సారవంతం చెయ్యాలంటే, సేంద్రియ ఎరువులను వాడవలసి ఉంటుంది.

సేంద్రియ ఎరువుల్లో ఎన్నో రకాలున్నాయి, వాటిలో ఒకటే ఈ నవధాన్యాల సాగు. సాధారణంగా నవధాన్యాల సాగును వేసవి కాలంలో చేపడతారు. ఈ నవధాన్యం మొక్కలు భూమికి పునర్జీవం పోసి సారవంతం చెయ్యడంలో సహాయపడతాయి. ఈ నవధ్యానాల సాగు ప్రకృతి వ్యవసాయంలో ఒక భాగం. అంతేకాకుండా నవధాన్యాల సాగుకు అయ్యే ఖర్చుకూడా తక్కువే.

నవధాన్యాల సాగు చేపట్టాలనుకున్న రైతులు వేసవిలో లేదంటే పంటకు పంటకు మధ్య ఉన్న సమయంలో వీటిని సాగుచెయ్యచ్చు. ప్రస్తుతం ఎరువుల వినియోగం అధికమవ్వడం మూలాన, మట్టిలో సూక్ష్మపోషక నిల్వలు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి. ఈ పోషక లోపాలు పంట దిగుబడిని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇది ఇలాగె కొనసాగితే మరికొన్ని రోజులు పంట భూములు పూర్తిగా నిర్జీవంగా మారి పంటలు పండని పరిస్థితి నెలకొంటుంది.

నవధాన్యాల సాగు ద్వారా మట్టిలో పోషక విలువల శాతం పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకు అవసరమైన నత్రజని, భాస్పరం, పొటాషియం, లబ్యత పెరగడమే కాకుండా, సూక్ష్మపోషకాలు కూడా మట్టిలో కలిసి మొక్క ఎదుగుదలలో దోహదపడతాయి. వీటితో పాటు అధిక ఎరువుల వినియోగం ద్వారా వ్యవసాయ క్షేత్రాలు చౌడుబారుతున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. నవధాన్యాలను పచ్చి రొట్ట ఎరువుగా వాడటం మూలాన చౌడు సమస్యను కూడా నివారరించవచ్చు. నేల నుండి సంక్రమించే ఎన్నోరకాల తెగుళ్లను నివారించడంలోనూ పచ్చి రోత్త ఎరువులు తోడ్పడతాయి.


రైతులంతా నవధ్యానాల పంటలు సాగుచెయ్యాలని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. దీనికి సంభందించిన విత్తనాలను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ఈ నవధాన్యాలు అంటే ఏమిటనే సందేహం మీకువచ్చే ఉండచ్చు, నవధాన్యాలు మొత్తం తొమ్మిది రకాలు, వీటిలో గోధుమలు, వరి, కందులు, పెసలు, మినుములు, శెనగలు, బొబ్బర్లు, ఉలవలు, నువ్వులు వంటివి ప్రధానమైనవి. వీటిని పొలంలో చల్లి, మొక్కలు అన్ని ఎదిగాక మట్టిలో కలియదున్నాలి. మొక్కల అవశేషాలు మట్టిలో బాగా కలిసిన తరువాత ప్రధాన పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా చెయ్యడం ద్వారా భూమిలో సారం పెరిగి, నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine