Agripedia

మొక్కజొన్న పంట యాజమాన్యం

KJ Staff
KJ Staff

మన దేశంలో, ధాన్యం, గోధుముల తర్వాత ఎక్కువుగా సాగు చేసే పంట మొక్క జొన్న. ఇక్కడే పండే మొక్క జొన్న విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. మొక్క జొన్నలో అనేక పోషక విలువలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. మొక్క పండించే సమయంలో కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పక పాటించాలి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కజొన్న దాదాపు అన్ని రకాల నెలల్లో పెరుగుతుంది. రేగడి నేలలు, ఇసుకతో కూడిన నేలలు, గరప మొదలైన నేలలు అనుకూలం, మంచి దిగుబడి పొందేదుకు ఉదజని సూచిక 6.5- 7 వరకు ఉండేలా చూసుకోవడం మంచిది. నీరు నిలిచిపోయే నేలలు, ఆమ్ల, క్షార నేలలు మొక్క జొన్న సాగుకు పనికి రావు. మొక్క జొన్నను ఖరీఫ్ పంటగా సాగుచేస్తారు, యాసంగిలో నీటి లభ్యత ఉన్నవారు యాసంగి పంటగా మరికొన్ని ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తారు. ఖరీఫ్ పంటగా సాగు చేసేవారు జూన్ 15 నుండి జులై 15 వరకు విత్తుకునేందుకు అనుకూలం. ఒక ఎకరానికి 7 కిలోల వరకు విత్తనం అవసరం. మొక్క ఎదిగే సమయంలో ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు విత్తన శుద్ధి చెయ్యడం కీలకం, దీనికోసం 2 గ్రాముల మాంకోజెబ్ , 4 గ్రాముల ఇమిడాక్లోరోఫిడ్ ఒక లీటర్ నీటికి కలిపి ఈ ద్రావణంలో విత్తనాలను ఒక గంట సేపు నానబెట్టి తర్వాత నాటుకోవాలి.

సాధారణంగా మొక్క జొన్నను బోదె పద్దతిలో సాగు చేస్తారు, ఈ పద్దతిలో బోదెల మధ్య 60-70 సెంటీమీటర్ల దూరం మరియు మొక్కల మధ్య 20-25 సెంటీమీటర్ల కాళీ ఉండేలా విత్తుకోవాలి. విత్తనాలను దగ్గర గా కనుక విత్తుకున్నట్లైతే మొక్కకు అవసరమైన నీరు మరియు పోషకాలు అందవు అంతేకాకుండా అన్ని ఆకులకు సమాంతరంగా సూర్యరష్మీ తగలక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటూ, తెగుళ్లను సమర్ధవంతంగా తట్టుకోగలిగే రకాలను ఎంచుకోవాలి. హైబ్రిడ్ రకాలు సాగు చేస్తే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. వీటిలో డిహెచ్ యం- 103, 105, 107, బి. హెచ్- 2187, త్రిశూలత మొదలైనవి మేలైన రకాలు.

మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం చాలా కీలకం. విత్తనం విత్తే ముందు ఒక ఎకరానికి 20 కేజీల భాస్వరం, 16 కిలోల పోటాష్ చివరి దుక్కులో కలిపి కలియ దున్నుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం మూడు భాగాలుగా విభజించాలి. నత్రజని ఎరువు తొందరగా ఆవిరైపోతుంది కనుక మొక్క ఎదిగే వివిధ దశల్లో మొక్కకు అందించాలి. మొక్క జొన్న సాగుకు 40 కేజీల నత్రజని అవసరం దీనిని మూడు భాగాలుగా విభజించి, విత్తు నాటుకుని ముందు ఒక పావు వంతు, మొక్క ఎదిగిన 30 రోజులకు సగం వంతు, 50-55 రోజుల తర్వాత మిగిలిన వంతు మొక్కలకు అందించాలి. సూక్ష్మ పోషకాల్లో జింక్ ధాతువు లోపం ప్రధానంగా కనిపిస్తుంది, జింక్ లోపించినక్ నేలల్లో మొక్క ఆకులు పసుపు పచ్చ రంగులోకి మరియు లేత పైరు తెలుపు రంగులో కనిపిస్తుంది. ఈ సమయంలో, ఒక లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

మొక్కలు ఎదిగే సమయంలో ఎటువంటి కలుపు మొక్కలు రాకుండా జాగ్రత్తులు పాటించాలి. కలుపు నియంత్రణకు అట్రాజిన్ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చెయ్యాలి. పంట ప్రారంభించిన 30-40 రోజుల మధ్య కల్టివేటర్ తో అంతరకృషి చెయ్యడం ద్వారా కలుపును సమర్ధవంతంగా నియంత్రించవచ్చు.

Share your comments

Subscribe Magazine