Agripedia

వ్యవసాయ రంగం లో డ్రోన్ ల వినియోగం !

Srikanth B
Srikanth B
వ్యవసాయ రంగం లో డ్రోన్ ల వినియోగం !
వ్యవసాయ రంగం లో డ్రోన్ ల వినియోగం !

భారత దేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం , సుమారు 77 % శాతం ప్రజానీకం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు ,భారత దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 17.5 శాతం వ్యవసాయ రంగం ద్వారా సమకూరుతుంది . అయితే మారుతున్న కాలం తో పాటు, పెరుగుతున్న జనాభాకి సరిపడా ఆహారం పండించాలన్న, వ్యవసాయం లో పెరుగుతున్న వ్యవసాయ కూలీలా కొరతను అధిగమించాలన్న వ్యవసాయ రంగం లో నూతన సాంకేతికలతో కూడిన డ్రోన్ ల యొక్క వినియోగాన్ని పెంచడం ఎంతయినా అవసరం .

ప్రాశ్చత్య దేశాలు అయినా ఆస్ట్రేలియా , జపాన్ ,సింగప్పూర్ వంటి దేశాలు  వ్యవసాయ రంగం లో డ్రోన్ ల ఇప్పటికే డ్రోన్ల వినియోగం పై చట్టాలనూ చేసి అమలు పరుస్తున్నాయి, పశ్చిమ యూరోప్ దేశాలు కూడా త్వరలోనే తమ దేశాలలో వ్యవసాయ రంగం లో  డ్రోన్ ల  పై చట్టాలను చేయనున్నాయి. అదే తరహాలో భారత దేశం కూడా వ్యవసాయ రంగం లో డ్రోన్ ల వినియోగం పై భారత దేశం  ప్రత్యేక శ్రాధ కనబరుస్తుంది  అనడానికి  భారత ప్రభుత్వం ఇటీవలి కాలం వ్యవసాయ రంగం లో డ్రోన్ ల విని యోగం పై తీసుకున్న నిర్ణయాలె ఒక ఉదాహరణగ చెప్పవచ్చు.

భారత దేశం లో గత కొన్ని నెలలు గ డ్రోన్ల వినియోగం పై ప్రస్తావనలు వస్తూనే వున్నాయి, గత నెల ఫిబ్రవరి 16 న  ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృశ్య మాధ్యమం ద్వారా దేశ వ్యాప్తం గ " 100 కిసాన్ డ్రోన్ లను  " ప్రారంభించారు ,ఆ తరువాత రాజస్థాన్ , మహారాష్ట్ర ,జార్ఖండ్ వంటి రాష్ట్రాలు వరుసగా వ్యవసాయ రంగం లో డ్రోన్ ల వినియోగాన్ని ప్రారంభించాయి . అదే విధం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు), హైదరాబాద్, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో సర్టిఫికేట్ కోర్సును ,విమానయానంలో ప్రత్యేకత కలిగిన సంస్థ సహకారంతో ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ను రూపొందించనుంది ,  పేర్కొన్న పై  అంశాలు రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం లో డ్రోన్ లు కీలకం గ మారనున్నాయి .

భారతదేశంలో వ్యవసాయ డ్రోన్ ధర:

ఒక వ్యవసాయ డ్రోన్ తరచుగా ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి పిచికారీ మరియు పంట ఆరోగ్య పర్యవేక్షణ వంటి ఖచ్చితమైన వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తుంది, దీని ధర 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉన్నాయి , ప్రస్తుతం FPO ల కు ప్రభుత్వం తరపున  డ్రోన్ కొనుగోళ్ల ఆపై 75% సబ్సిడీ లభిస్తుంది , వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు 100 % సబ్సిడీ మీద డ్రోన్లను అందించనుంది .

డ్రోన్ లను ఉపయోగించడం కొరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్:

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ఎస్ వోపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) జారీ చేసింది, ఇది డ్రోన్లు, డ్రోన్ పైలట్లు మరియు డ్రోన్ ఆపరేటర్లు ఏరియల్ క్రిమిసంహారక పిచికారీ ఆపరేషన్ సమయంలో అనుసరించాల్సిన సూచనలు, నిబంధనలు మరియు ఆవశ్యకతలను జాబితా సూచిస్తుంది అవి :

క్రిమిసంహారిణి పిచికారీ చేసే ప్రాంతాన్ని డ్రోన్ ఆపరేటర్ ద్వారా డ్రోన్ పైలట్  ఆ పరిసరాలను  ముందు మార్క్ చేయాలి.

ఆమోదించబడ్డ క్రిమిసంహారకాలను మాత్రమే ఉపయోగించాలి.

ప్రథమ చికిత్స సదుపాయాలను ఆపరేటర్ లకు అందించాలి.

ఆపరేషన్ కు సంబంధం లేని జంతువులు లేదా వ్యక్తులు నిర్ధిష్ట కాలం పాటు ఆపరేషన్ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతించరాదు.

డ్రోన్ పైలట్ లు క్రిమిసంహారకాల యొక్క క్లినికల్ ప్రభావాలతో సహా క్రిమిసంహారకాల స్పెషలైజేషన్ లో  ట్రైనింగ్ ను పొంది ఉండాలి.

డ్రోన్ ల వినియోగం లో సవాళ్లు :

డ్రోన్ల వినియోగం అనేది పూర్తి గ సాంకేతికతతో కూడుకునట్టువంటి అంశం ,రైతులు సులువుగా వినియోగించలేరు మరియు డ్రోన్ల కొనుగోళ్లు అనేది సామాన్య చిన్న ,సన్నకారు రైతులకు ఖర్చుతో కూడుకునట్టువంటిది ,మరియు యు డ్రోన్ లను వినియోగించేటపుడు

విద్యుత్ స్తంబాలు  , పొలం మద్యలోగల చెట్లు వీటికి అడ్డంకిగా మారవచ్చు .

TELANGANA (PJTSAU):వ్యవసాయ రంగం లో డ్రోన్ వినియోగం కోసం కోర్సు ప్రారభించనునా (PJTSAU), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (krishijagran.com)

 ఏది ఏమైనప్పటికి మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణం గ రైతు వ్యవసాయ రంగం లో వస్తున్న సాంకేతిక పరిజ్ఞాన్ని అలవర్చుకుని అధిక దిగుబడులను సాధించేవిధం గ ముందుకుసాగాలి .

BIG UPDATE!KISAN DRONE: 100 కిసాన్ డ్రోన్ లను ప్రారంభించిన ప్రధాని మోడీ (krishijagran.com)

Share your comments

Subscribe Magazine