రైతులు జపాన్ పద్ధతిలో సాగు విధానాన్ని అవలంబించాలని టీఎస్ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
అమెరికా మరియు చైనా వంటి అగ్ర దేశాలకు బదులుగా, భారతీయ రైతులు జపాన్ దేశ వ్యవసాయ పద్ధతిని అనుసరించాలని ఎందుకంటే నేల విషయంలో భారతదేశానికి మరియు జపాన్ కి చాలా పోలికలు ఉన్నాయి. రెండు దేశాలకూ అధికంగా చిన్నపాటి భూములు ఉన్నాయి. కాబట్టి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిన్న భూమిలో విజయవంతంగా సాగు చేస్తున్న జపాన్ సాగు విధానాలను భారతీయ రైతులు అనుసరించాలి అని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.అంతే కాకుండా చిన్నపాటి భూములకు సరిపడా వ్యవసాయ యంత్రాలను తయారు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ రైతులు ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అనుసరించి సాగు చేయాలని హితవు చేసారు. వ్యవసాయ శాస్త్రవేత్తల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించే దిశగా వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరారు.
ప్రపంచంలోని చాలా దేశాలు వ్యవసాయం చేయలేక ఆహార ధాన్యాల కొరకు పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాయి.భారతదేశ విషయానికి వస్తే సాగుకు అనుకూలంగా అత్యధికంగా 56 శాతం భూమి ఉన్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో దేశం 16వ స్థానంలో ఉందని, చిన్న దేశాలు అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం అని అన్నారు.
జపాన్ వ్యవసాయ రంగం సమయానుకూలమైన పద్ధతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎప్పటికప్పుడు సాంకేతికతని ఆధునీకరిస్తారు.వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తుంటారు. వినూత్న వ్యవసాయానికి సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మరిన్ని చదవండి
Share your comments