Agripedia

Crops to grow in Summer: వేసవిలో పెంచగలిగే పంటలు

KJ Staff
KJ Staff
chillies
chillies

రస్తుతం వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పలేకుండా ఉన్నాం. అకాల వర్షాలతో పాటు ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు కూడా పంటలు సరిగ్గా పండకుండా చేస్తున్నాయి.

అందుకే ఏ సీజన్ లో ఎలాంటి పంటలు వేయాలన్న దానిపై ముందుగానే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎండాకాలంలో పండించగలిగే కూరగాయలు, ఇతర పంటలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంటలన్నింటినీ ఎండాకాలంలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ఉన్న పొలాల్లో పండించే వీలుంటుంది. అప్పుడప్పుడూ పడే వర్షాలు కూడా వీటిపై పెద్దగా ప్రభావం చూపించలేవు.

ఎండాకాలంలో పండించే పంటలు

మిర్చి

పచ్చి మిర్చిని సాధారణంగా క్యాష్ క్రాప్ అని పిలుచుకోవచ్చు. దీన్ని పెంచడం చాలా సులభం. అమ్మడం కూడా చాలా సులభం. అందుకే పచ్చి మిర్చి ని పండించి మంచి లాభాలను పొందే వీలుంటుంది. పచ్చి మిర్చిలో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అందుకే దీన్ని ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తుంటారు. అందుకే మార్కెట్లో మిర్చికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. మంచి సారవంతమైన రేగడి నేలలను ఇవి పండించేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. మిర్చి పంటను పండించేందుకు పూస జ్వాల, RCH1, X235, పంత్ C-1, G3, G5, హంగేరియన్ వ్యాక్స్ (పసుపు), పూస సదా బహార్, పంత్ C-2, జవహర్ 218 , L AC206 రకాలను ఎంచుకోవడం వల్ల దిగుబడి ఎక్కువగా పొందవచ్చు.

బెండకాయ

బెండకాయను ఓక్రా లేదా లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఎలాంటి రకమైన నేలలో అయినా పెరుగుతుంది. అయితే దీన్ని నాటే ముందు నేలను రెండు మూడు సార్లు బాగా దున్నాల్సి ఉంటుంది. దీనికి నేల కాస్త గట్టిగానే ఉంటూ వేళ్లు లోపలికి వెళ్లేలా ఉండాలి. గింజలను వరుసగా నాటుకోవాలి. మొక్కలు నాటుకున్న పది నుంచి ఇరవై రోజుల మధ్యలో కలుపు తీసుకోవాలి. హిసార్ ఉన్నత్, పర్బానీ క్రాంతి, పంజాబ్- 7, అర్క అనామిక, వర్ష ఉపార్, అర్క అభయ్, హిసార్ నవీన్, VRO-6, Pusa A-4,HBH వంటి రకాలను ఎంచుకొని బెండకాయ మొక్కలను నాటుకుంటే మంచి లాభాలు పొందే వీలుంటుంది.

 తోటకూర

సాధారణంగా వేసవిలోనే కాదు.. సరైన నీటి వసతి ఉంటే ఏ కాలంలో అయినా ఆకుకూరలు మంచి లాభాలను అందిస్తాయి. అయితే తోటకూర పండించేందుకు రైతులు మంచి సారవంతమైన నేలను ఎంచుకోవాల్సి ఉంటుంది. రాళ్లు రప్పలు లేకుండా చూసుకొని ఈ నారు పోసుకోవాలి. నీళ్లు ఎక్కువగా నిలువ ఉండని ఇసుక కలిసిన మట్టి నేలలు దీనికి సరైన ఎంపిక. వేడి వాతావరణంలో ఇది చాలా బాగా పెరుగుతుంది. ఎకరానికి సుమారు రెండు కేజీల విత్తనాలు అవసరమవుతాయి. స్క్వేర్ మీటర్ కి అర గ్రాము చొప్పున చల్లుకుంటే సరిపోతుంది. ఇందులో పూస కీర్తి, పుసా లాల్ చౌలాయ్, పుసా కిరణ్ వంటి రకాలు మంచి దిగుబడులను అందిస్తాయి.

రౌండ్ పొట్ల కాయ

దీన్నే యాపిల్ గార్డ్ లేదా స్వ్కాష్ అని కూడా పిలుస్తారు. ఈ పంటను ఎండాకాలంలో సులువుగా పండించవచ్చు. దీన్ని మార్చి లేదా ఏప్రిల్ నెలల నుంచి మే లేదా జూన్ నెలల వరకు పెంచుకోవచ్చు. కావాలంటే వర్షాకాలం పంటగా జూన్ లో నాటి జులైలో కాయలు కోసుకోవచ్చు. ఈ పంట పండించేందుకు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండే కోస్తా వాతావరణం చక్కగా నప్పుతుంది. ఎకరానికి సుమారు రెండు నుంచి మూడు కేజీల గింజలను నాటుకోవాల్సి రావచ్చు. వీటిని నాటుకొని రోజూ కొద్ది మొత్తంలో నీటి తడిని అందిస్తే చాలు.. ఈ మొక్కలు చాలా సులువుగా పెరిగి మంచి లాభాలను అందిస్తాయి. ఇందులో టిండా ఎస్ 48, హిసర్ సెలక్షన్ 1, బికనీరీ గ్రీన్, అక్రా టిండా రకాలను ఎంచుకోవడం మంచిది.

https://telugu.krishijagran.com/kheti-badi/these-vegetables-take-the-least-amount-of-time-to-grow/

https://telugu.krishijagran.com/agripedia/malaysian-farmers-increase-production-and-taste-of-muskmelons-with-this-method/

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More