Agripedia

పెరట్లోనే ముత్యాల పంట.. లక్షల్లో ఆదాయం!

KJ Staff
KJ Staff

సాధారణంగా ముత్యాలు మనకు చెరువులు నదీ పరివాహక ప్రాంతాలలో పండుతాయని విషయం మనకు తెలిసిందే.అయితే ముత్యాలను పెరట్లో కూడా పండించవచ్చు అని మీరు ఎప్పుడైనా విన్నారా.ఇది ఎంతో అసాధ్యం తో కూడిన పని అయినప్పటికీ దీనిని సుసాధ్యం చేసి చూపించారు కేరళకు చెందిన ప్రొఫెసర్ మతాచన్‌.

మతాచన్‌ కి ఫిషరీ మీద ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ అతను చదువుకున్నది టెలికాం ఇంజనీరింగ్ కావడంతో ప్రొఫెసర్ గా స్థిరపడ్డాడు.సౌదీ అరేబియాలోని కింగ్‌ ఫహ్ద్‌ పెట్రోలియం–మినరల్స్‌ యూనివర్సిటీలో టెలికమ్యూనికేషన్స్‌ ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ విధంగా ప్రొఫెసర్ ఉద్యోగం చేసే సమయంలో సౌదీ చమురు కంపెనీ అధికారులతో పాటు చైనా పర్యటన వెళ్ళాడు. చైనా పర్యటనకు వెళ్లిన మతాచన్‌కి అక్కడ వుక్సిలో గల దాన్‌షూయి మత్స్య పరిశోధనా స్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ క్రమంలో అతని చూపులు అక్కడ సాగుతున్న ముత్యాల పై పడింది.

చైనా నుంచి తిరిగి దుబాయ్ చేరుకున్న అతను ఎలాగైనా ముత్యాల పంటను సాగు చేయాలని భావించాడు.ఈ క్రమంలోనే తన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి చైనా వెళ్లి మొక్కల పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. తిరిగే ఆరు నెలల తర్వాత కేరళ కు చేరుకొని తన ఇంటి పెరటిలో ముత్యాల సాగుకు చేశారు. నదులలో దొరికే ఆల్చిప్పలను తెచ్చి 18 నెలల్లో 50 బక్కెట్లలో పెంచిన ముత్యాలను రూ. 4.5 లక్షలకు అమ్మగా అతనికి మూడు లక్షల రూపాయల లాభం వచ్చింది. ఇలా సాగు చేసిన ముత్యాలను మతాచన్‌ ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌కు ఎగుమతి చేసి భారీగా డబ్బు గడిస్తున్నారు .

ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయడంతో మొదట్లో తిట్టిన వారే ఇప్పుడు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విధంగా ఇంట్లోనే ముత్యాలను ఏ విధంగా సాగు చేసుకోవాలో 26 రోజుల పాటు ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ పొందటానికి పదివేల రూపాయల చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రొఫెసర్ మతాచన్‌... కాస్త రైతు మతాచన్‌ మారి రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More