Agripedia

సజ్జ సాగు ప్రాముఖ్యత, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు ఎంపిక.....!

KJ Staff
KJ Staff
sajja rakalu
sajja rakalu

సజ్జ చిరుధాన్యములో మన శరీరానికి అవసరమైన కాల్వియం,మెగ్నిషియం, ఇనుము, భాస్వరం వంటి పోషక విలువలు ఎక్కువ మొత్తంలో ఉండడంతోపాటు, డయాబెటిస్, ఉబకాయం వంటి వ్యాధిగ్రస్తులకు మంచి బలవర్థకమైన ఆహారం కావడంతో సజ్జ ధాన్యానికి దేశంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా సజ్జ సాగును వర్షాభావ పరిస్థితులలోను, సకాలంలో ప్రధాన పంటను వేసుకోలేని సమయంగా స్వల్పకాలిక పంట అయిన సజ్జ పంటను వేస్తుంటారు.

సజ్జ పంటనే ప్రధాన పంటగా సాగు చేయాలనుకుంటే ఖరీఫ్ సీజన్లో అయితే జూన్ - జూలై మొదటి వారంలో అదునుగా విత్తు కుంటే అధిక దిగుబడులు సాధించ వచ్చు. లేదా వేసవి పంట అయితే జనవరి మాసం సజ్జ పంటకు చక్కటి అనుకూలం.ఆంధ్రప్రదేశ్లో సజ్జ పంట 2.03 లక్షల ఎకరాలలో సాగుచేస్తూ 82 వేలటన్నుల దిగుబడులను సాధిస్తున్నారు. సజ్జలో చాలా రకాలు ఉన్నప్పటికీ మన ప్రాంత వాతావరణానికి సరిపడు విత్తన రకాన్ని ఎన్నుకోవడం మంచిది. ప్రస్తుతం ఎక్కువ ప్రాచుర్యం పొందిన కొన్ని విత్తన రకాలు ఇప్పుడు చూద్దాం.

సజ్జ విత్తన రకాలు:

ఐ.సి.టి.పి.-8203: పంటకాలం 80-85 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. గింజలు లావుగా,తెల్లగా వుంటాయి .వెఱ్రికంకి తెగులును , బెట్టను తట్టుకుంటుంది.

డబ్ల్యు.సి.సి-75 (కాంపోజిట్) : పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 180 సెం.మీ. ఎత్తు కుదురుకు 2-3 పిలకలు వేస్తుంది. కంకి పొడవు 25-30 సెం.మీ. కంకులు లావుగా ఉండి. గింజలు లావుగా బూడిద రంగులో వుంటాయి . వెఱ్రికంకి తెగులును తట్టుకుంటుంది . అన్ని ప్రాంతాలకు అనుకూలం.

ఐ.సి.యమ్.వి-221 : పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. వెఱ్రికంకిని తట్టుకోగల కాంపోజిట్ రకం .అన్ని ప్రాంతాలకు అనుకూలం .

ఐ.సి.యమ్.హెచ్ - 356 : పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 150 సెం.మీ. ఎత్తు ఎదిగి కంకులు బూడిద రంగులో వుంటాయి.

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

పి.హెచ్.బి - 65 : పంటకాలం 77-81 రోజులు.దిగుబడి ఎకరాకు 10-12 క్వింటాళ్ళు. పైరు 200 సెం.మీ. ఎత్తు ఎదిగి ఆకుపచ్చగా ఉండి పశుగ్రాసమగా ఉపయోగపడ్తుంది.

యమ్.ఎల్.బి.హెచ్ - 322 : పంటకాలం 75-80 రోజులు.దిగుబడి ఎకరాకు 10-11 క్వింటాళ్ళు. పైరు రెండు మీటర్లు ఎత్తు పెరిగి రెండు లేదా మూడు కంకులు కలిగి పశుగ్రాసమగా కూడా ఉపయోగపడ్తుంది.

మల్లికార్జున : పంటకాలం 80-85 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. వర్షాభావ పరిస్తితులకు తట్టుకుంటంది.సజ్జ సాగు చేసే ప్రాంతాలకు అనుకూలం.

ఐ.సి.యమ్.హెచ్ - 451: పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 180 సెం.మీ. సంకర రకం. పైరు 175 సెం.మీ. ఎత్తు ఎదిగి, 2-3 పిలకలు వేస్తుంది. గింజలు మద్యస్థ లావుగా బూడిద రంగులో ఉంటాయి. వెఱ్రికంకి తెగులును తట్టుకుంటుంది.అన్ని ప్రాంతాలకు అనుకూలం .

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

Share your comments

Subscribe Magazine