Horticulture

జామ కు అనువైన నేలలు & వాతావరణం మరియు జామ సాగుకి మేలైన రకాలు!

Gokavarapu siva
Gokavarapu siva

జామ సాగులో అధిక దిగుబడి సాధించడానికి కావాల్సిన నేల రకాలు,వాతావరణం మరియు వీటి సాగుకి ముఖ్యమైన రకాలను తెలుసుకుందాం.

నేలలు:
జామ తోటల ఏర్పాటుకై క్షార నేలలు. నల్ల రేగడి నేలలు. నీరు ఇంకే గరప నేలలు మరియు ఒండ్రు నేలలు అనువైనవి.చిత్తడి నేలలు అంతగా అనుకూలం కాదు.pH సూచిక 5.5 నుండి 7.5 మధ్య ఉండాలి.

వాతావరణం:
ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల వాతావరణంలో జామ విజయవంతంగా పెరుగుతుంది. పొడి వాతావరణంలో పండ్ల నాణ్యత మెరుగ్గా ఉంటుంది

జామలో ముఖ్య రకాలు:
L-49 (లక్నో-49) :
దీని గుజ్జు తెలుపు రంగులో ఉంది తీయటి రుచితో ఉంటుంది.
గుజ్జు లోపలి భాగంలో చాలా మృదువైన గింజలను కలిగి ఉంటుంది. ఇది మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.హెక్టారుకు 25 టన్నుల దిగుబడి వస్తుంది.

అలహాబాద్ సఫేదా:
ఇది ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధ చెందిన రకం. చెట్టు బలమైన శాఖలు మరియు దట్టమైన ఆకులతో మధ్యస్థ ఎత్తులో ఉంటుంది
పండ్లు మధ్యస్థ పరిమాణంలో (180గ్రా), గుండ్రంగా ఉంటాయి.

బనారసి:
ఈ రకం 4.0 నుండి 5.5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది మరియు పండ్లు గుండ్రంగా, లేత-పసుపు రంగులో ఉంటాయి.
ఇది ప్రధానంగా ప్రాసెసింగ్ కోసం సాగు చేయబడుతుంది.

చిట్టిదార్:
చిట్టిదార్ సఫేదాను పోలి ఉంటుంది, ఈ పండుపై అనేక గులాబీ ఎరుపు చుక్కలు ఉంటాయి.

హరిజా :
ఈ రకం 3.5 నుండి 4.5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది మరియు చాలా తక్కువగా కొమ్మలు కలిగి ఉంటుంది. పండ్లు గుండ్రంగా ఉంటాయి, తీపి రుచితో ఆకుపచ్చని పసుపు రంగులో ఉంటాయి.

రెడ్ ఫ్లెడ్:
చెట్టు 3-5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. పై భాగం పసుపు రంగుని కైలిగి ఉండి లోపల గుజ్జు
గులాబీ రంగు లో ఉంటుంది.

అర్కా మృదుల:
ఈ రకం అలహాబాద్ సఫేదా యొక్క మొలకల నుండి ఎంపిక చేయబడింది. మొక్కలు పాక్షికంగా ఎత్తుగా ఉంటాయి
పండ్లు గుండ్రంగా 180 గ్రా. బరువుతో ఉంటాయి పై భాగం పసుపు రంగులో లోపటి గుజ్జు తెలుపు రంగులో మృదువుగా ఉంటుంది.
పెక్టిన్ శాతం అధికంగా ఉండటం వలన ఈ రకం విస్తృతంగా ప్రాసెసింగ్ కొరకు ఉపయోగించబడుతుంది.

మరిన్ని చదవండి.

అరటి లో దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన రకాలను తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine