Agripedia

ఈ వర్షాకాలం సీజన్ లో పత్తి పంటకి ప్రభుత్వ ప్రోత్సాహం!

S Vinay
S Vinay

ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పత్తి పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సదస్సులను నిర్వహించనుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ పత్తికి విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వర్షాకాల పంటలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి పత్తి పంట సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టనుంది.గత ఖరీఫ్‌లో వరదలు, అనూహ్య వర్షాల కారణంగా పత్తి దిగుబడి బాగా తగ్గిపోయి పత్తికి ధర పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా గత ఖరీఫ్‌లో కనీస మద్దతు ధరను రూ.625 అదనంగా పెంచింది.

రాష్ట్రంలో వరి కొనుగోలుపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉండడంతో సగటు రైతులకు క్వింటాల్‌కు రూ.8వేలు లభించగా ఇటీవల ఖమ్మంలో రూ.14వేలకు చేరింది.గత ఖరీఫ్‌లో వరదల వల్ల పత్తి దిగుబడి తగ్గిందని, అయితే ఈసారి పత్తి పంటలో మంచి లాభాలు రావచ్చని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. మరోవైపు ఈ ఖరీఫ్‌లో పత్తి సాగు చేసేందుకు రైతులు కూడా ఆసక్తి చూపుతుండడంతో ఈసారి పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది.

పత్తి సాగుకి ప్రభుత్వ ప్రోత్సాహం:

రాష్ట్రంలో 75-80 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి రైతు వేదికలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల పని చాలా కీలకంగా వ్యవహరించనున్నారు.

వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతి రైతు వేదిక అందుబాటులో ఉంటారని,ఈసారి క్రాప్ బుకింగ్‌లు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతాయని, రైతులు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించగలరు అని వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ మరియు TS ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSAIDCL) మేనేజింగ్ డైరెక్టర్ కె రాములు తెలిపారు.

అంతే కాకుండా రైతు వేదికలు ప్రతి గ్రామంలో 50-100 మంది రైతులకు వ్యవసాయంలో శాస్త్రీయ పురోగతులు మరియు పత్తి సాగులో వారికి ఎలా ప్రయోజనం చేకూర్చాలనే దానిపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తామని రాములు తెలిపారు.


మరిన్ని చదవండి

మొక్కలలో పోషక లోపాల లక్షణాలు మరియు అధిక మోతాదు వల్ల సంభవించే నష్టాలు!

మానవ మనుగడకి పంచ భూతాలు ఎంత అవసరమో తేనెటీగలు కూడా అంతే అవసరం!

Share your comments

Subscribe Magazine