Agripedia

రబీ పంటకు ఎరువుల కొరత లేదు.. !

Srikanth B
Srikanth B
రబీ పంటకు ఎరువుల కొరత లేదు.. !
రబీ పంటకు ఎరువుల కొరత లేదు.. !

దేశవ్యాప్తం గ కొన్ని రాష్ట్రలలో ఎరువుల కొరత ఉందని వస్తున్న కథనాలలో వాస్తవం లేదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది , దానికి సంబంధించి ఏయే ఎరువుల నిల్వలు ఎంత మేరకు ఉన్నాయనేదానికి సంబంధించిన సమాచారాన్ని వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది .

దేశంలో అందుబాటులో ఉన్న వివిధ ఎరువుల వివరాలు:

యూరియా:
దేశంలో 2022-23 పంట కాలంలో 180.18 ఎల్ఎంటీల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 16.11.2022 నాటికి 57.40 ఎల్ఎంటీల అవసరం ఉంటుంది. అయితే, 16.11.2022 నాటికి ఎరువుల విభాగం 92.54 ఎల్ఎంటీల యూరియాను అందుబాటులో ఉంచింది. ఈ సమయంలో 38.43 ఎల్ఎంటీల యూరియా అమ్మకాలు జరిగాయి. రాష్ట్రాల వద్ద 54.11 ఎల్ఎంటీల యూరియా నిల్వలు ఉన్నాయి. దీనితో పాటు యూరియా ఉత్పత్తి చేస్తున్న ప్లాంటుల వద్ద 1.05 ఎల్ఎంటీల యూరియా, ఓడ రేవుల్లో 5.05 ఎల్ఎంటీల యూరియా నిల్వలు ఉన్నాయి. యూరియా అవసరాలు తీర్చడానికి ఈ నిల్వలు సరిపోతాయి.

డీఏపీ:
దేశంలో 2022-23 పంట కాలంలో 55.38 ఎల్ఎంటీల డీఏపీ అవసరం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 16.11.2022 నాటికి 26.98 ఎల్ఎంటీల డీఏపీ అవసరం ఉంటుంది. అయితే, 16.11.2022 నాటికి ఎరువుల విభాగం 36.90 ఎల్ఎంటీల డీఏపీను అందుబాటులో ఉంచింది. ఈ సమయంలో 24.57 ఎల్ఎంటీల డీఏపీ అమ్మకాలు జరిగాయి. రాష్ట్రాల వద్ద 12.33 ఎల్ఎంటీల డీఏపీ నిల్వలు ఉన్నాయి. దీనితో పాటు యూరియా ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ల వద్ద 0.51 ఎల్ఎంటీల డీఏపీ , ఓడ రేవుల్లో 4.51 ఎల్ఎంటీల డీఏపీ నిల్వలు ఉన్నాయి. డీఏపీ అవసరాలు తీర్చడానికి ఈ నిల్వలు సరిపోతాయి.

ఎంఓపి :
దేశంలో 2022-23 పంట కాలంలో 14.35 ఎల్ఎంటీల ఎంఓపి అవసరం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 16.11.2022 నాటికి 5.28 ఎల్ఎంటీల ఎంఓపి అవసరం ఉంటుంది. అయితే, 16.11.2022 నాటికి ఎరువుల విభాగం 5.28 ఎల్ఎంటీల ఎంఓపి అందుబాటులో ఉంచింది. ఈ సమయంలో 3.01 ఎల్ఎంటీల ఎంఓపి అమ్మకాలు జరిగాయి. రాష్ట్రాల వద్ద 5.03 ఎల్ఎంటీల ఎంఓపి నిల్వలు ఉన్నాయి. దీనితో పాటు ఓడ రేవుల్లో 1.17 ఎల్ఎంటీల ఎంఓపి నిల్వలు ఉన్నాయి. ఎంఓపి అవసరాలు తీర్చడానికి ఈ నిల్వలు సరిపోతాయి.

పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?

ఎన్ పి కె :
దేశంలో 2022-23 పంట కాలంలో 56.97 ఎల్ఎంటీల ఎన్ పి కె అవసరం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 16.11.2022 నాటికి 20.12 ఎల్ఎంటీల ఎన్ పి కె అవసరం ఉంటుంది. అయితే, 16.11.2022 నాటికి ఎరువుల విభాగం 40.76 ఎల్ఎంటీల ఎన్ పి కె ను అందుబాటులో ఉంచింది. ఈ సమయంలో 15.99 ఎల్ఎంటీల ఎన్ పి కె అమ్మకాలు జరిగాయి. రాష్ట్రాల వద్ద 24.77 ఎల్ఎంటీల ఎన్ పి కె నిల్వలు ఉన్నాయి. దీనితో పాటు ఎన్ పి కె ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ల వద్ద 1.24 ఎల్ఎంటీల ఎన్ పి కె , ఓడ రేవుల్లో 2.93 ఎల్ఎంటీల ఎన్ పి కె నిల్వలు ఉన్నాయి. ఎన్ పి కె అవసరాలు తీర్చడానికి ఈ నిల్వలు సరిపోతాయి.

ఎస్ఎస్పీ :
దేశంలో 2022-23 పంట కాలంలో 33.64 ఎల్ఎంటీల ఎస్ఎస్పీ అవసరం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 16.11.2022 నాటికి 14.05 ఎల్ఎంటీల ఎస్ఎస్పీ అవసరం ఉంటుంది. అయితే, 16.11.2022 నాటికి ఎరువుల విభాగం 24.79 ఎల్ఎంటీల ఎస్ఎస్పీ అందుబాటులో ఉంచింది. ఈ సమయంలో 9.25 ఎల్ఎంటీల ఎస్ఎస్పీ అమ్మకాలు జరిగాయి. రాష్ట్రాల వద్ద 15.54 ఎల్ఎంటీల ఎస్ఎస్పీ నిల్వలు ఉన్నాయి. దీనితో పాటు ఎస్ఎస్పీ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ల వద్ద 1.65 ఎల్ఎంటీల ఎస్ఎస్పీ అవసరాలు తీర్చడానికి ఈ నిల్వలు సరిపోతాయి.

అందువల్ల, దేశంలో యూరియా, డీఏపీ, ఎంఓపి, ఎన్ పి కె మరియు ఎస్ఎస్పీ ఎరువుల లభ్యత రబీ పంట కాలం అవసరాలకు సరిపోతుంది.

పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?

Related Topics

fertilizers

Share your comments

Subscribe Magazine