Agripedia

వ్యవసాయానికి సంబంధించిన అద్భుత విషయాలు.

KJ Staff
KJ Staff
6000 varities of Apple
6000 varities of Apple

6000 వేల వెరైటీల యాపిల్స్ పండుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పండుతున్న యాపిల్ వెరైటీలు సుమారు 6000. ప్రపంచంలో యాపిల్స్ ఎక్కువగా పండించే దేశాలు చైనా, అమెరికా, టర్కీ, రష్యా, ఇరాన్ ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. పింక్ లేడీ, ఫుజి, ఎంపైర్, గోల్డెన్ డెలిషియస్, గాలా, హనీ క్రిస్ప్ లాంటివి కొన్ని పాపులర్ వెరైటీలు.

ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో ఉంది.

మన దేశం ప్రపంచంలోనే వ్యవసాయ ఆధారిత వస్తువుల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో ఏడో స్థానంలో ఉంది. పప్పు ధాన్యాలు పండించడంలో మన దేశం ముందుంది. వీటితో పాటు పాలు, బియ్యం, జనప నార, కాటన్ వంటివి కూడా ఎగుమతి చేస్తుంది. మన దేశం భారత్ లోని జనాభాకు సరిపడా పండించడంతో పాటు ఎగుమతులు కూడా చేస్తోంది. 2019 లో మన దేశం 8.25 బిలియన్ డాలర్ల లాభాలను వీటిపైనే సాధించింది.

2050 కల్లా 70 శాతం ఎక్కువగా పండించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పండిస్తున్న పంటల కంటే 70 శాతం ఎక్కువగా పండిస్తేనే 2050 కల్లా ప్రపంచ జనాభాకి సరిపోయేంత ఆహారం ఉంటుందట. ప్రస్తుతం ప్రపంచ జనాభా ఏడు మిలియన్లు.. అప్పటికి అది 9 మిలియన్ల అవుతుంది. కాబట్టి ఆహారం కూడా అంతగా పెరగాల్సిందేనట. ఇందుకోసం వ్యవసాయంలో కొత్త పద్ధతులు పాటించి దిగుమతులు పెంచాల్సి ఉంటుంది.

ఆర్గానిక్ వ్యవసాయం పనికి రాదు.

ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కేవలం 1 శాతం నేలలో మాత్రమే ఈ తరహా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. మన దేశంలో కేవలం సిక్కిం మాత్రమే ఆర్గానిక్ వ్యవసాయం కొనసాగించే రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రం తమ ప్రజలకు ఆహారాన్ని అందించేందుకే ఇతర రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధినందిస్తోంది.

దాదాపు అన్ని ఇండస్ట్రీలు వ్యవసాయ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉంటాయి. అన్ని దేశాలకు వ్యవసాయమే వెన్నెముక. ప్రతి దేశం జీడీపీ, ఎకానమీ, డెవలప్ మెంట్ వంటివన్నీ ఆ దేశంలో వ్యవసాయం ఎంత డెవలప్ అయిందన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.

ఫుట్ బాల్ ఫీల్డ్ అంటే ఎకరం..

ఒక ఫుల్ బాల్ మైదానం దాదాపు ఒక ఎకరం స్థలంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎకరం అంటే 43,560 స్క్వేర్ ఫీట్లు.. ఫుట్ బాల్ మైదానం 48,000 స్వ్కేర్ ఫీట్లలో ఉంటుంది.

అరటి పండ్లే అత్యధికంగా పండించే పంట

ప్రపంచంలో అత్యధికంగా పండించే పంటల్లో ఒకటి అరటి పంట. అత్యధికంగా పండించే పంటల్లో దీనిది మొదటిస్థానం. గోధుమ, వరి, మొక్క జొన్న తర్వాత స్థానం దీనిదే. అరటి పండ్లు ఎక్కువగా పండించే దేశం మనదే.

మేక మొదట పెంపకం ప్రారంభించిన జంతువు..

చాలా అధ్యయనాల ప్రకారం మానవుడు పెంచుకోవడం ప్రారంభించిన మొదటి జంతువు మేక అట. ఇవి చాలా శుభ్రత పాటిస్తాయి. ఆవులు, కుక్కలు, కోళ్ల కంటే ఇవి ఆహారాన్ని ఎంచుకొని ఎంచుకొని తింటాయట. కింద పడిన లేదా పాడైన ఆహారాన్ని అవి అస్సలు ముట్టుకోవు.

తేనేటీగలే అంత లాభాలను అందిస్తున్నాయి.

ప్రపంచంలో 80 శాతం మొక్కల పరాగ సంపర్కం ఈగలు, తేనెటీగల వల్లే జరుగుతుంది. 90 శాతం ఆహార పంటల్లో పరాగ సంపర్కం కూడా ఇలాగే జరుగుతుంది. కేవలం తేనెటీగలే అమెరికాలోని పంటల పరాగ సంపర్కం ద్వారా ఆ దేశానికి పదిహేను బిలియన్ల లాభాలను అందిస్తున్నాయట.

భారత్ పత్తి పంటకు ఫేమస్.

మన దేశం ప్రపంచ వ్యాప్తంగా పత్తి పంటకు ఫేమస్. అంతేకాదు.. ప్రపంచంలో పత్తి ఎగుమతి చేసే దేశాల్లో మొదటి స్థానం కూడా మన దేశానిదే. మన దేశం నుంచి అమెరికా, ఇటలీ, జర్మనీ లతో పాటు కొన్ని ఇతర దేశాలకు పత్తి ఎగుమతి అవుతుంది.

అంతా ఆ వయసుకు చెందిన వారే.

అమెరికాలో దాదాపు 60 శాతానికి పైగా రైతులు 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారే. కుటుంబ వ్యాపారంగా వారు దీన్ని కొనసాగిస్తూ ఉంటారు.

పాల ఉత్పత్తిలో కూడా మొదటి స్థానం. పండ్లు, కూరగాయల్లో రెండో స్థానం.

మన దేశం అల్లం, బెండకాయ, బంగాళాదుంప, ఉల్లిపాయలు, వంకాయలు వంటి కూరగాయల ఎగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. పండ్లలో అరటి, బొప్పాయి, మామిడి వంటి పండ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తుంటుంది మన దేశం.

ఆర్గానిక్ వ్యవసాయంలో మొదటి స్థానం మనదే..

మన దేశంలోనే ఆర్గానిక్ వ్యవసాయం చేసే రాష్ట్రం సిక్కిం. వీటితో పాటు గుజరాత్, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఆర్గానిక్ వ్యవసాయం కొనసాగిస్తున్నారు.

ఫంగస్ ఎంతో సాయపడుతుంది.

ఫంగస్ సన్నని ఫంగల్ మైసీలియం ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా దూరం ప్రయాణించి నీటిని నిలువ చేస్తుంది. ఇది మొక్కల వేళ్లకు నీటిని అందిస్తుంది. తద్వారా మొక్కల పెంపకంలో తోడ్పడుతుంది.

70 శాతం వ్యవసాయ పనులు మహిళలవే..

అమెరికాలో దాదాపు 30 శాతం వ్యవసాయ పనులన్నీ మహిళలే చేస్తారు. 2002 నుంచి మరో 20 శాతం మహిళా రైతులు పెరిగారు. వీరిలో 75 శాతం మంది తమ పేరు మీద వ్యవసాయ భూములు కలిగి ఉన్నారు. మన దేశంలో రైతులు మెకానిక్ గా, పశువుల పెంపకం, బిజినెస్ వంటి పనులు కూడా చేస్తారు.

Share your comments

Subscribe Magazine