Agripedia

ఇంటిపైనే కూరగాయల సాగు, ఆరోగ్యంతో పాటు ఆహ్లదం

Srikanth B
Srikanth B

ప్రస్తుతం కూరగాయలు సామాన్యుడికి అందుబాటు ధరలలో ఉండటం లేదు,మధ్య తరగతి కుటుంబానికి కూరగాయల ఖర్చు భారంగా మారాయి.వీటి సాగుకి అత్యధికంగా రసాయనిక మందులను వాడటం వల్ల ఆర్ధిక ఇబ్బందితో పాటు ఆరోగ్యానికి కూడా చేటు చేస్తుంది.
వీటికి ప్రత్యామ్న్యాయంగా మన ఇంటి పైనే అతి తక్కువ ఖర్చులో మనకి ఇష్టమైన కూరగాయలను పండించుకోవచ్చు .

వీటి సాగుకి కావాల్సిన మెళకువలు తెలుసుకోండి
ముందుగా కావాల్సినవి :
*పాలిథీన్ షీట్
*వృధాగా ఉన్న మట్టి కుండలు లేక ప్లాస్టిక్ డబ్బాలు
*ఆసరాకి సన్నటి కర్రలు

దీని కొరకు పాలిథీన్ షీట్, వాడేసిన కుండలు మరియు ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించవచ్చు , ముందుగా పాలిథీన్ షీట్ మేడపై ఉన్న స్థలం లో పరిచి దానిపై మట్టిని సమానంగా ఏర్పరుచుకోవాలి దీని కొరకు సాధారణ మట్టిని కాకుండా కర్బన పదార్థం (organic matter) ఎక్కువగా ఉన్న మట్టిని ఎంచుకోవడం ఉత్తమం. ఇక్కడ ఒక చిన్నపాటి నేలను తయారుచేసుకోవాలి పాలిథీన్ షీట్ లేని పరిస్థితులలో కుండలలో లేక ప్లాస్టిక్ డబ్బాలలో మట్టిని నింపుకోవాలి .దీనికి తగినంత నీరుని అందిస్తూ తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి.

కూరగాయల ఎంపిక
మనం తరుచూ వాడే కూరగాయలను ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి,కొత్తిమీర మరియు ఆకుకూరలు వేసుకుంటే మంచిది వీటితో పాటు బెండకాయ, కాకరకాయ,వంకాయ ,గోకరకాయ మరియు తీగ జాతికి చెందిన చిక్కుడు, సోరకాయ మరియు బీరకాయలు మొదలగునవి అనువైనవి.
కూరగాయల సస్యరక్షణ చర్యలు చాలా సులభం అయినప్పటికీ మొలకల దశలో ఉన్నప్పుడు పక్షుల బెడద నుండి కాపాడుకోవాలి నీటి సరఫరా కూడా చాలా సులభతరం. రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందులకు బదులుగా పకృతి సహజ సిద్దమైన వాటిని వాడటం మేలు
*విత్తన శుద్ధి కొరకు బీజామృతాన్ని
*పోషాకాల కొరకు జీవామృతాన్ని
*పంట పురుగుల నివారణకు వేప కషాయాన్ని వాడటం ఉత్తమం
ఈ మొక్కలకి ఆసరాగా మధ్యలో సన్నటి పొడవైన కర్రలను పాతుకోవాలి. తీగజాతి మొక్కలకు పందిరిని ఏర్పరుచుకోవాలి. వీటి పంట వ్యవధి కూడా తక్కువ కావడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని పొందవచ్చు .

PM ఉచిత కుట్టు మిషన్ పథకం; ఈ విధంగ దరఖాస్తు చేసుకోండి

ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం :
కొద్దిపాటి శ్రమతో తగినంత దృష్టి సారించి మనకున్న ఆ కాస్త స్ధలంలో ఒక చిన్నపాటి తోటను ఏర్పాటు చేసుకోవచ్చు దీనివల్ల మనకి కావాల్సిన కూరగాయలను పొందటంతో పాటు మన ఇంటి వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.

ఆయుస్మాన్ కార్డుతో రూ.5 లక్షలు వైద్య సాయం .. ఎలాగంటే?

Share your comments

Subscribe Magazine