Agripedia

పసుపు సాగు విధానం , కలుపు నివారణ చర్యలు...!

KJ Staff
KJ Staff

పచ్చ బంగారంగా పిలువబడే పసుపు పంట సాగును రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. సాధారణంగా పసుపు పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం ఉండి 25-30డిగ్రీలు ఉష్ణోగ్రత వున్న ప్రాంతాలు ఈపంట సాగుకు అనువుగా వుంటాయి.సాధారణంగా పసుపు పంట సాగును మే మూడో వారం నుంచి జూన్‌ రెండో వారం వరకు చేపట్టవచ్చు. పసుపు సాగుకు సేంద్రియ పదార్థం పుష్కలంగా ఉన్న ఇసుక నేలలు , ఒండ్రు మట్టి నేలలు, గరప నేలలు చక్కటి అనుకూలం. అయితే మురుగు నీటి పారుదల వసతి తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే పసుపు దుంప కుళ్ళి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది.

పసుపు పంటను నీటి పారుదల వసతి మరియు వర్షాధారంగా పంటగా కూడా సాగు చేయవచ్చు. సాధారణంగా పసుపు పంటను ఎత్తు మడుల పద్ధతి, బోదెల పద్ధతిలో సాగు చేస్తారు.బోదెల పద్ధతిలో 45 నుడి 50 సెంటీమీటర్ల ఎడంగా తయారుచేసుకొని బోదెల మీద 25 సెంటీమీటర్ల దూరంలో దుంపలు నాటుకోవాలి. ఎత్తు మడుల పద్ధతిలో మీటరు వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తుగల మడులు తయారు చేసుకొని, మడుల మధ్య 30 సెంటీమీటర్లు, దుంపల మధ్య 25 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటుకోవాలి.

కలుపు నివారణ ,అంతరకృషి:

కలుపు సమస్య ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు దుంపలు నాటిన మరుసటిరోజే అట్రజిన్ కలుపు మందును ఎకరాకు 600-800 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి నేల మొత్తం పిచికారి చేసుకోవాలి.దుంపలు నాటిన 40-45 రోజులకు కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి. నేల మరియు కలుపు ఉధృతి బట్టి వంట కాలంలో 3 -4 సార్లు పలు దఫాలుగా కలుపు నివారణకు అంతరకృషి చేపట్టాలి. కూలీల సమస్య అధికంగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కలుపు మందులు వాడాలి.

 

Share your comments

Subscribe Magazine