Animal Husbandry

వేసవిలో పాడి 'పశువుల పోషణ, యాజమాన్య నిర్వహణ పద్ధతులు !

Srikanth B
Srikanth B

మార్చ్  నెల ముగియనుండడం  తో క్రమేపి ఎండలు పెరగనున్న వేళా పాడి పశువులను మేపే రైతులు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది , ఎండలు ముదరడం తో పచ్చి గడ్డి కొరత ఏర్పడి పాల దిగుబడి తగిపోతుంది మరియు తీవ్రమైనా ఎండా మరియు వేడి గాలుల వాళ్ళ పశువులు తీవ్ర  అస్వస్ధ కు గురిఅవుతాయి ఆ కారణం పాల దిగుబడి బాగా తగ్గి పోయి రైతులకు తీవ్ర నష్టన్ని మిగులుస్తుంది అయితే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వాళ్ళ నష్ఠాల నుంచి బయట పడవచ్చు . 

1) నిర్మాణ నిర్వహణ పరమైన జాగ్రత్తలు 

2) పోషకాలు నిర్వహణ పరమైన జాగ్రత్తలు 

నిర్మాణ నిర్వహణ పరమైన జాగ్రత్తలు : పశువులు అధిక వేడి బారి న పడకుండ పశువులను చల్లటి ప్రదేశాము లో వుండేటట్టు తగు జాగ్రత్త పడాలి షెడ్డు నిర్మాణాలు కలిగిన రైతులు వాటీ పైన గొనె సంచులను పేర్చి క్రమంగ తడుపుతూ ఉండాలి ,బయటి వేడి గాలులు రాకుండా షెడ్డు అంచులకు గొనె సంచులను వ్రేలాడదీయాలి తద్వారా  షెడ్డు లో కొంతవరకు వేడి తీవ్రత తగ్గి పశువులు అస్వస్థకు గురి కాకుండా ఉంటాయి . పశువులు తమకు తాముగా శరీరము యొక్క వేడిని తగ్గించ దానికి శక్తిని ఉప్పయోగించలేవు అవీ 40- 50 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే వాటిపై ఈ  ప్రభావం పడుతుంది . 

2)  పోషకాలు నిర్వహణ పరమైన జాగ్రత్తలు : ఎండ తీవ్రత కారణంగా పశువులకు చమట అధికంగా పట్టి శరీరం లోని ఆమ్లాలను కోల్పోవడం జరుగుతుంది , అదే సమయం లో పశువులకు ఎండా తీవ్రత కారణంగ అధిక దాహం ఉంటుంది తద్వారా అధిక మొత్తము నీళ్ళుతీసుకోవడం జరిగి సరైన పోషకాలు అందవు ముఖ్యంగ పోటాషియం,సోడియం కాబ్బట్టి వీటిని వాటియొక్క ఆహారం లో ఉండే టట్టు జాగ్రత్తపడాలి . అలాగే  వాటి దాణా లో ఫైబర్ , కొవ్వు పద్దార్దలు  వుండేటట్టు చూసుకోవడం ద్వారా పాల దిగుబడి తగ్గ కుండా ఉంటుంది .

పిండి పద్దార్థలు కల్గిన దాణా ను తగ్గించాలి ఎందుకంటే వేసవిలో వీటిని  ఇవ్వడం ద్వారా జీర్ణ గదులలో ఆమ్లా స్వభావం పెరిగి జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం వుంటుంది . ఇటువంటి చిన్న చిన్న మార్పుల చేసుకోవడం ద్వారా పాల దిగుబడి మరియు పశువులను అస్వస్ధ కు గురికాకుండా కాపాడుకోవచ్చు.

మీ సొంత పశు గ్రాసాన్ని పెంచుకోవడంలో మెళకువలు తెలుసుకోండి. (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More