Animal Husbandry

నాటుకోళ్ల పెంపకానికి అనువైన రకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

KJ Staff
KJ Staff

ప్రస్తుతం పౌల్ట్రీ కోళ్ల పెంపకం మొదలుపెట్టిన తరువాత నాటు కోళ్ల పెంపకం కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. పౌల్ట్రీ కోళ్లు కొద్దీ కాలంలోనే ఎదిగి, ఎక్కువు మొత్తంలో గుడ్లు పెడతయి అయితే నాటు కోళ్లు పెరగడానికి చాల సమయం పడుతుంది అంతేకాకుండా గుడ్లు ఏవి పెట్టె గుడ్లు కూడా తక్కువే, కనుక కోళ్ల పెంపకందారులు పౌల్ట్రీ కోళ్ల పెంపకానికి ఎక్కువ ఆశక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికి గ్రామీణ ప్రాంతంలోని రైతులు, మహిళలు మరియు యువకులు నాటు కోళ్లను పెంచుతున్నారు, కొంతమంది ఎక్కువ మొత్తంలో వీటిని పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నవారు ఉన్నారు. మార్కెట్లో కూడా పౌల్ట్రీ కోళ్లతో పోలిస్తే నాటు కోడి గుడ్లకు మరియు మాంసానికి ఖరీదు కూడా ఎక్కువే, కనుక వీటిని పెంచేవారు మంచి లాభాలను పొందేందుకు వీలుంటుంది. మన వాతావరణ పరిస్థితులను తట్టుకొని, రోగాలను కూడా తట్టుకోగల నాటు కోళ్ల రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాజశ్రీ కోళ్లు:

ఈ జాతి కోళ్లను ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేసారు. పెరటి కోళ్లుగా పెంచుకోవడానికి ఇవి అనుకూలం. వీటికి రోగాలను తట్టుకోగలిగే శక్తీ చాల ఎక్కువ, రెండు నెల్లల్లోనే 500 గ్రాముల బరువు పెరగగలవు. ఈ కోళ్లు 160 రోజుల తరువాత గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి, ఇలా ఒక ఏడాదికి 170 గుడ్లను పెట్టగల సామర్ధ్యం ఈ కోళ్లకు ఉంది. అయితే ఈ కోళ్లు పెట్టిన గుడ్లు పొదగడానికి ఇన్క్యూబెటర్ అవసరం అవుతుంది.

గిరిరాజా కోళ్లు:

పెరటి కోళ్ల పెంపకానికి ఇవి ఎంతో అనువైనవి. ఈ కోళ్లు కేవలం రెండు నెలల్లోనే 3 కేజీల వరకు బరువు పెరుగుతుంది మరియు అత్యధికంగా 5 కేజీల బరువు పెరుగుతుంది. గిరిరాజా జాతి కోళ్లను బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించారు. ఏవి సంవత్సరానికి ఏకంగా 140 నుండి 170 గుడ్లను పెట్టగలవు.

కడక్నాథ్ కోళ్లు:

దేశి కోళ్ల అన్నిటిలోకెల్లా ఈ కడక్ నాథ్ కోళ్ల మాంశం ఖరీదు ఎక్కువ, వీటి మాంశం కుడా నలుపు రంగులో ఉండటం ప్రత్యేకం. కడక్ నాథ్ మధ్య ప్రదేశ్లో పుట్టి భారత దేశమంతా ప్రాధాన్యత సంతరించుకుంది. మాములు నాటుకోడి మాంశంతో పోలిస్తే కడక్ నాథ్ మాంశంలో మాంశకృతులు ఎక్కువ. సంవత్సరానికి కేవలం 100 కోడిగుడ్లే పెట్టిన దీని మాంసానికి మరియు గుడ్లకు డిమాండ్ చాలా ఎక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది.

 

శ్రీనిధి కోళ్లు:

పెరటి కోళ్లు లేదా నాటు కోళ్లు పెంపకం మొదలుపెట్టేవారికి ఈ కోళ్లు అనుకూలమైనవి. మిగిలిన నాటుకోళ్లతో పోలిస్తే ఏవి ఎక్కువ మొత్తంలో గుడ్లను పెట్టగలవు. గోధుమ వర్ణంలో ఉండే ఈ కోళ్లు సంవత్సరానికి 150-160 గుడ్లు పెట్టగలవు. ఐదు నెలల వయసు నుండే గుడ్లను పెట్టడం మొదలుపెడతాయి. అంతేకాకుండా ఈ కోళ్లు పొడవైన కాళ్లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి.

వానరాజా కోళ్లు:

ఇంటివద్ద సులభంగా పెంచుకోదగ్గ కోళ్లలో ఇవి ఒకటి. ఈ జాతి కోళ్లను హైదరాబాద్, రాజేంద్రనగర్లోని డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ వారు అభివృద్ధి చేసారు. అధిక సంఖ్యలో గుడ్ల పెట్టడం, ఆకర్షణీయమైన రంగును కలిగివుండటం, మరియు ఎక్కువ రోగనిరోధక శక్తీ కలిగివుండటం వీటి ప్రత్యేకత. ఐదు నెలల వయసుకే 2.5 కేజీల వరకు బరువు పెరుగుతాయి. సంవత్సరానికి 150 వరకు గుడ్లను పెడుతుంది.

గ్రామా ప్రియా కోళ్లు:

ఈ జాతి కోళ్లను దాదాపు అన్ని రకాల వాతావరణాల్లోను సులభంగా పెంచవచ్చు. చూడటానికి ఆకర్షనియ్యంగా ఉండటంతోపాటు, ఎక్కువ బరువుకూడా పెరుగుతాయి, ఆరునెలల వయసులోనే సుమారు 2.5 కేజీల బరువు పెరగగలవు. అంతేకాకుండా వ్యాధి నిరోధకశక్తి కూడా చాలా ఎక్కువ కాబట్టి జబ్బులభారిన పడే అవకాశం చాల తక్కువ.

Share your comments

Subscribe Magazine