Animal Husbandry

వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులను అరికట్టడం ఎలా?

KJ Staff
KJ Staff

దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వర్ష కాలం పశువులు మరియు జీవాల పెంపక దారులకు ఒక గడ్డు కాలం వంటిది. ఈ కాలంలో గొర్రెలు మరియు మేకలు రోగాలకు గురయ్యే అవకాశం ఎక్కువుగా ఉంటుంది, అంతేకాకుండా వర్ష కాలంలో రోగాలు వేగంగా వ్యాప్తి చెందేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెంపకదారులు ముందుగానే ఈ రోగాలను గుర్తించి తగిన చికిత్సను అందించవలసి ఉంటుంది.

ముఖ్యంగా వర్షాకాలం రాగానే రైతులంతా వ్యవసాయ కార్యకలాపాలు మొదలుపెడతరు కాబట్టి జీవాలకు అవసరమైన మేతలో కొరత ఏర్పడుతుంది, దీని వలన వాటిని కాలి ప్రదేశాల్లో మేతకు వదలవలసి ఉంటుంది. వర్ష కాలంలో అప్పుడే మొలిచిన గడ్డిని జంతువులూ మెయ్యడం మూలాన వీటికి ఎన్నో వ్యాధులు సోకె ప్రమాదం ఉంది. వీటిలో గొంతు వాపువ్యాధి, జబ్బ వాపువ్యాధి, మరియు చిటుక వ్యాధి వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. కాబట్టి జీవాల పెంపక దారులు ముందుగానే ఈ వ్యాధులు రాకుండా మందులు మరియు టీకాలు అందించాలి. మందులు అందించడానికి ఇప్పుడే మంచి సమయం కనుక పెంపక దారులు ఈ వ్యాధులు రాకుండా నివారణ పద్దతులను ఇప్పటినుండే అవలంభించాలి.

గొంతువాపు మరియు జబ్బా వాపు మొదలైన వ్యాధులు ప్రాంతాన్ని బట్టి సోకడానికి ఆస్కారం ఉంది, వీటితో పాటు జీవాలకు ప్రధానంగా వచ్చే వ్యాధుల్లో పిపిఆర్ వ్యాధి దీనినే పారుడు వ్యాధి అనికూడా పిలుస్తారు. జీవాలు వర్షంలో తడిచిన లేదంటే పశువుల పాక తక్కువ స్థలంలో ఉన్న ఈ వ్యాధి ప్రభలమవ్వడానికి ఆస్కారం ఉంది. ఆ వ్యాధి సోకినా జంతువుల్లో శరీర ఉష్ణోగ్రత 40-41℃ వరకు ఉంటూ, ముక్కు మరియు నోటి నుండి స్రావాన్ని విడుదల చేస్తుంది, వ్యాధి ఎక్కువగా ఉంటె డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా నివారించడానికి వర్షకాలం రాబోయే ముందు ఈటీ టీకాలను అందించాలి, ఈ టీకా వేసిన 20 రోజుల తరువాత నీలి నాలుక వ్యాధి టీకాను కూడా వెయ్యించాలి.

ఈ వర్షాకాలంలో మసూచి వ్యాధి దీనినే కొన్ని ప్రాంతాల్లో చిటికె వ్యాధి అనికూడా అంటారు. ఇది ఒక వైరస్ వ్యాధి, వ్యాధి సోకినా జంతువులూ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, చర్మం మీద అక్కడక్కడా బొడిపెలు వంటివి రావడం గమనించవచ్చు, ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు టీకాలు అందుబాటులో ఉన్నాయి, గొర్రెలకు షీప్ ఫాక్స్ మరియు మేకలకు గోట్ ఫాక్స్ వాక్సిన్ వెయ్యించాలి.

వీటితో పాటు పరాన్న జీవులు మరోయు పురుగులు ప్రభలమయ్యే కాలం వర్ష కాలం, వీటి నుండి జీవాలను కాపాడుకోడానికి షెడ్ పరిసరాలను శుభ్రంగా ఉంచడం, పురుగులు రాకుండా నివారించడం మొదలైన పద్దతులను ఆచరించాలి. వర్ష కాలంలో మురుగునీరు ఎక్కువుగా నిలుస్తుంది జీవాలు ఈ నీటిని తాగడం మూలాన రోగాల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కనుక ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ జీవాలను సంరక్షించుకోవాల్సి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine