Animal Husbandry

సులువుగా కోళ్ల పెంపకం చేపట్టడం ఎలా?

Srikanth B
Srikanth B

చాలా వరకు కోళ్లను పెంచాలంటే పెద్ద పెద్ద ఫారం లాంటివి ఎక్కువ పెట్టుబడితో నిర్మించక తప్పదు. కానీ తక్కువ పెట్టుబడి తో తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా కోళ్లను పెంచవచ్చు.అది ఎలా అంటే ముందుగా గేదెను కట్టేసే లాంటి షెడ్ లు కోళ్ల పెంపకంకు సులువుగా ఉంటుంది. మొదట 7.5 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తులో మూడు కానాలను కోళ్ళ కోసం ఏర్పాటు చేయాలి.

దానిపైన ఆరడుగుల ఎత్తులో 20 లీటర్ల ఫైబర్ ట్యాంక్ ని ఏర్పాటు చేసి అందులో ప్రతిరోజు నీటిని నింపి అందులో ఉండే కోళ్లకు అందుబాటులో ఉండేటట్లు అవకాశాన్ని కల్పించాలి. ఇక 18 నుండి 19 వారాల వయసులో ఉన్న కోడి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. అదే వయసులో ఉన్న 120 కోళ్లను పెంచినట్లయితే ఏడాది పాటు గుడ్లు పెడతాయి.ఆ కోళ్లను అమ్మేసి మళ్లీ గుడ్లు పెట్టే వయసున్న కోళ్లను పంజరంలో పెంచుకోవచ్చు. తెల్లని లేదా గోధుమ రంగులో ఉన్న కోళ్లను పెంచుకున్నట్లయితే అందులో తెల్ల కోళ్ళు 95 శాతం గుడ్లను అందిస్తుంది.

గోధుమ రంగు కోళ్ళు 83 శాతం వరకు అందిస్తుంది. ముఖ్యంగా కోళ్లను పంజరంలోనే ఉంచాలి. తెల్లవారుజామున 4.30-5 గంటల మధ్యలో లైట్ వేయాలి. అదే సమయంలో 4.5 కిలోల దాణాను 120 కోట్లకు వేయాలి. పైన ట్యాంకులో 20 లీటర్ల నీటిని నింపాలి. ఇక ఆ పంజరంలో కోడి ముక్కుతో పొడిస్తే నీరు అందుబాటులోకి వస్తుంది. తిరిగి సాయంత్రం ఐదు గంటల సమయంలో 4.5 కిలోల దాణా వేయాలి. రాత్రి 8.30 గంటలకు లైట్లను తీసివేయాలి. ఈ విధంగా అతి తక్కువ పెట్టుబడితో పెంపకం చేయడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి.

"పొదుగు వాపు "వ్యాధికి నివారణను మించిన ఉత్తమమైన మార్గం లేదు" -ప్రొఫెసర్ డాక్టర్ కిషన్ కుమార్

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More