Animal Husbandry

"పొదుగు వాపు "వ్యాధికి నివారణను మించిన ఉత్తమమైన మార్గం లేదు" -ప్రొఫెసర్ డాక్టర్ కిషన్ కుమార్

Srikanth B
Srikanth B

పాడి రైతు సోదరులకు తీవ్ర కలవరానికి గురిచేసే ,పాల ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేసి పాడి పరిశ్రమను తీవ్ర నష్టం కల్గించే వ్యాధి "పొదుగు వాపు" దీని పై రైతులకు అవగాహన కల్గించడానికి "కృషి జాగరణ్' ప్రముఖ వెటర్నరీ విశ్వవిద్యాలయం " P.V నర్సింగ రావు వెటర్నరీ విశ్వ విద్యాలయం" ప్రొఫెసర్ డాక్టర్ కిషన్ కుమార్ గారితో వెబినార్ ను నిర్వహించింది .
ప్రొఫెసర్ డాక్టర్ కిషన్ కుమార్ ఈ వెబినార్ లో మాట్లాడుతూ వ్యాధి సోకడానికి గల కారణాలు ,నివారణ చర్యలను రైతు సోదరులకు వివరించారు అవి ;

వ్యాధి కి  కారణమయ్యే బ్యాక్టీరియాలు:

"పొదుగు వాపు" కారణమయ్యే బ్యాక్టీరియాలు  పాశ్చురెల్లా మల్టోసిడా, స్టెఫిలోకాకస్ ఆరియస్; Str. జూఎపిడెమికస్; Str. అగాలాక్టియే; Str. పయోజీన్స్; Str. ఫెకాలిస్; మైకోబాక్టీరియం బోవిస్, బ్రూసెల్లా అబార్టస్; సూడోమోనాస్ పియోసైనియస్; E.coli; లెప్టోస్పిరా పోమోనా, మొదలైనవి పాడి పశువుల్లాలో పొదుగు వాపు వ్యాధి సోకాదీనికి ప్రధాన కారణాలని,పొదుగు లో ఏర్పడే  గాయాల కారణముగా , పేలవమైన పరిశుభ్రత మరియు/లేదా గాయం కూడా ఈ పరిస్థితికి కారణమవుతాయి. అని ప్రొఫెసర్ డాక్టర్ కిషన్ కుమార్ గారు వెల్లడించారు .

వ్యాధి లక్షణాలు:

"మాస్టిటిస్" యొక్క స్పష్టమైన సంకేతం పొదుగు యొక్క వాపు, ఇది ఎరుపు గ మారుతుంది. ఉబ్బిన పొదుగు  వేడిగా ఉంటుంది మరియు కేవలం తాకడం వల్ల జంతువుకు నొప్పి మరియు అసౌకర్యం కలుగుతుంది. జంతువులు పొదుగును తాకడానికి కూడా అనుమతించవు, . పాలు పితికినట్లయితే, పాలు సాధారణంగా కాకుండా పాలలో రక్తపు గడ్డలు రావడం  , దుర్వాసనతో కూడిన గోధుమ రంగు స్రావాలు మరియు పాలు గడ్డలతో పాలు వస్తాయి .

పాల దిగుబడి పూర్తిగా తగ్గి పోతుంది .  పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇతర లక్షణాలు ఆకలి లేకపోవడం, పొదుగు వాపు మరియు నొప్పి కారణంగా సరిగ్గా నడవలేక పోవడం .  వ్యాధి తీవ్రమైన  సందర్భాలలో  పొదుగులో చీము ఏర్పడుతుంది.

నివారణ మార్గాలు :

 "పొదుగు వాపు"(మాస్టిటిస్)  సమస్య రాకముందే నివారించడం మంచిది.  ఈ కింది చర్యలు  తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు .

  • పాలు పితికే ప్రాంతాన్ని శుభ్రం గ ఉంచాలి .
  • ప్రతి ఆవుపై చనుమొనలను శుభ్రం చేయడానికి వేర్వేరు వస్త్రం లేదా కాగితపు టవల్ ను ఉపయోగించండి
  • పాలు పితికే ముందు చేతులను శుభ్రం గ కడుకోవాలి
  • పాలు పితికే తర్వాత పొడుగును శుభ్రం గ వేడి నీళ్లతో కడిగి , శుభ్రమైన గుడ్డ తో తుడవాలి .
  • పాలు పితికి న వెంటనే పశువులు పడుకోకుండా వాటికి మేత వేయాలి తద్వారా పశువులు క్రింద కూర్చున్నప్పుడు పొదుగు కి సంక్రమించే సూక్ష్మ జీవులను నివారించవచ్చని ప్రొఫెసర్  డాక్టర్ కిషన్ కుమార్ గారు వెల్లడించారు .

చికిత్స:

"పొదుగు వాపు"(మాస్టిటిస్) గుర్తించిన తర్వాత ప్రథమ చికిత్సలో భాగం గ  పొదుగు ఉపరితలంపై ఐస్ క్యూబ్‌లను పూయాలి . వ్యాధి సోకిన పశువు నుండి  పాలను రోజుకు మూడుసార్లు బయటకు తీసి సురక్షితంగా పారవేయాలి.

 పాలు పితికే సమయంలో, ఆరోగ్యవంతమైన, వ్యాధి సోకని ఆవులను మరియు  వ్యాధి  సోకిన ఆవులను మొదట పాలు పితికే విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి.

దూడలకు వ్యాధి సోకినా పశువుల పాలు త్రాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వ్యాధి తీవ్రతరం అయితే  వెటర్నరీ వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.  మరియు యాంటీబయాటిక్ చికిత్స కోర్సును వెంటనే ప్రారంభించాలి.

మరిన్ని చదవండి .

Organic farming :"రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్న్యాయంగా సేంద్రియ వ్యవసాయం దిశగా రైతును ప్రోత్సహించాలి"-M భాస్కరయ్య

 

 

 

 

 

 

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More