Animal Husbandry

Indian buffalo breeds: భారత్ లోని గేదెల రకాలు

KJ Staff
KJ Staff
Different Buffaloes Breed in India
Different Buffaloes Breed in India

వ్యవసాయంతో పాటు గేదెలు పెంచడం కూడా రైతులకు చాలా ముఖ్యమైన ఆదాయ వనరు అని చెప్పుకోవచ్చు.

ఆరు నెలలకోసారి ఆదాయానికి వ్యవసాయం నుంచి వచ్చే లాభాలను తీసుకుంటే రోజువారీ ఖర్చులకు మాత్రం ఆవులు, గేదెల పాల ద్వారా డబ్బు సంపాదించే వీలుంటుంది. ముఖ్యంగా గేదెల పెంపకం మంచి లాభసాటి వ్యాపారం. ఎందుకంటే ఇవి ఆవులతో పోల్చితే పాలు ఎక్కువగా ఇస్తాయి. వీటి పాలలో కొవ్వు శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది.

గేదెలను సుమారు 5000 సంవత్సరాల క్రితం మనిషి పెంచుకోవడం ప్రారంభించారు. ఇండస్ వ్యాలీలో వీటి పెంపకం ఎక్కువగా ఉండేది. వీటికి ఎక్కువ మేర నీళ్లు కావాల్సి రావడంతో నదీ తీర ప్రాంతాల్లోనే వీటిని ముందు ఎక్కువగా పెంచేవారు. కానీ ఇప్పుడు అన్ని చోట్ల పెంచుతున్నారు. ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా పాల కోసం పెంచే జంతువుల్లో గేదెలది చాలా ముఖ్యమైన స్థానం. ఇవి ఆవుల కంటే మూడు రెట్లు ఎక్కువగా పాలు ఇస్తాయి. మన దేశంలోని 47.22 మిలియన్ల గేదెలు దేశ అవసరాలకు సరిపోయే 55 శాతం పాలను అందిస్తున్నాయి. అదే 57 మిలియన్ల సంఖ్యలో ఉన్న ఆవులు మాత్రం కేవలం 45 శాతం పాలనే అందిస్తుండడం గమనార్హం. పాల కోసం కొన్ని ముఖ్యమైన రకాల గేదెలను ఎక్కువగా పెంచుతుంటారు. వాటి వివరాలు తెలుసుకుందాం..

భారత్ లో ముఖ్యమైన గేదెల రకాలు

1. ముర్రా

ఇది మన దేశంలోనే చాలా ముఖ్యమైన గేదెల జాతి. దిల్లీ, కుంది, కాళి అని కూడా దీన్ని పిలుస్తుంటారు. ఇది రోహ్ తక్, సింధ్, హిసర్, నభా, పటియాలా జిల్లాల్లో ఎక్కువ పెరుగుతుంది. దిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో దీని పెంపకం ఎక్కువ. ఈ గేదెలు చాలా నల్లని రంగులో ఉంటాయి. తోక, తల భాగాలు మరింత నలుపుగా ఉంటాయి. ఈ గేదెలు ఒక్కో సారికి సుమారు 1500 నుంచి 2500 లీటర్ల పాలను అందిస్తాయి. కేవలం 45 నుంచి 50 నెలల వయసులోనే మొదటిసారి ఇవి దూడను ఈనుతాయి. అదే పెద్ద గుంపుల్లో ఉంటే ఇంకా తొందరగా అంటే 36 నుంచి 40 నెలల మధ్యలోనే మొదటి దూడకు జన్మనిస్తాయి. మన దేశంలో ఎక్కువగా పాలు, వెన్న ఉత్పత్తి చేసే గేదెల రకాలు ఇవే.

2. జప్ఫర్ బడీ

ఇది చాలా బరువుగా ఉంటుంది. ఈ రకం గేదెలు పుట్టుకతోనే లావుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా గిర్ అడవుల్లో కనిపిస్తాయి. కచ్, జామ్ నగర్ జిల్లాల్లో వీటిని పెంచుతారు. నల్లని రంగుతో పెద్ద కొమ్ములు, పొడవాటి శరీరంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి ఒక్కో సూడిదకు సుమారు 1000 నుంచి 1200 లీటర్ల పాలను అందిస్తాయి. ఈ రకం దున్నపోతులకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇవి చాలా బలంగా ఉంటూ ఎద్దుల బండ్లు, దున్నడానికి ఉపయోగపడతాయి.

jaffarbadi Buffalo Breed
jaffarbadi Buffalo Breed

3. సుర్తీ

వీటిని దక్కణీ, గుజరాతీ, తలబ్ద, చరాతోర్, నడియడి అనే పేర్లతో కూడా పిలుస్తారు. గుజరాత్ లో ని కైరా, బరోడా జిల్లాల్లో వీటిని ఎక్కువగా పండిస్తుంటారు. ఇవి నలుపు లేదా బ్రౌన్ రంగుల్లో ఉంటాయి. శరీరం మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. అత్యధిక ఫ్యాట్ పర్సంటేజ్ (8 నుంచి 12 శాతం) ఉండే పాలను ఉత్పత్తి చేయడం ఈ జాతి గేదెల ప్రత్యేకత.

surti Breed Buffalo
surti Breed Buffalo

4.నీలి రావి

సట్లైజ్ వ్యాలీలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, పాకిస్థాన్ లోని సహివాల్ జిల్లాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. వీటి తల చిన్నగా పొడవుగా ఉంటుంది. పైన ఎత్తుగా ఉండి కళ్లు లోపలికి ఉండి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ జాతి గేదెల కళ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీటి కొమ్ములు కూడా చాలా చిన్నగా గుండ్రంగా తిరిగి ఉంటుంది. ఈ జాతి గేదెలు ఒకసారికి సుమారు 1500 నుంచి 1850 లీటర్ల వరకు పాలను అందిస్తాయి.

NEli Rava Breed
NEli Rava Breed

5. భడవారి

ఈ గేదెలు ఆగ్రా, ఎటేవా ఉత్తర్ ప్రదేశ్ లోని గ్వాలియర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ గేదెల చర్మపు రంగు రాగి రంగులో ఉంటుంది. గొంతుపై చెవ్రాన్ అనే రెండు తెల్లని గీతలు కూడా కనిపిస్తుంటాయి. ఇది ఒకసారిలో సుమారు 800 నుంచి 1000 లీటర్ల

6.నాగ్ పురీ

దీన్ని ఇలిచ్ పురీ, బరారీ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ రకం గేదెలు ఎక్కువగా మహారాష్ట్రలోని నాగ్ పుర్, అమ్రావతి, అకోలా వంటి జిల్లాల్లో కనిపిస్తాయి. వీటికి పొడవాటి ఒంపులు తిరిగి ఉన్న కొమ్ములు ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ పని చేస్తాయి. అందుకే వీటిని చాలా కష్టమైన పనికి కూడా ఉపయోగిస్తారు. ఒకసారికి ఇవి 700 లీటర్ల నుంచి 1200 లీటర్ల వరకు పాలను అందిస్తాయి.

7. మెహ్సనా

ఇవి ఎక్కువగా గుజరాత్ లోని మెహ్సనా, బనాస్ కాంతా, సబర్ కందా వంటి జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంటాయి. సుర్తీ, ముర్రా రకాలను బ్రీడింగ్ చేసి దీన్ని తయారుచేశారు. ఈ గేదెల రంగు నలుపు లేదా బూడిద రంగులో ఉంటుంది. ఇది ముర్రా గేదెల కంటే పెద్దగానే ఉన్నా కాళ్లు చిన్నగా కనిపిస్తాయి. ఇవి కూడా చాలా బరువులు మోస్తాయి. కానీ వీటిని నడక వేగం తక్కువ. అందుకే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటిని వ్యవసాయ పనులకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ గేదెలు కూడా ఒక్కోసారికి సుమారు 1200 నుంచి 1500 లీటర్ల పాలను ఇస్తాయి.

 

Nagpuru breed Buffalo
Nagpuru breed Buffalo

8.తోడా

దీన్ని ఎక్కువగా తోడా తెగకు చెందిన వారు పెంచుతుంటారు. తమిళ నాడులోని నీలగిరి ప్రాంతంలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. వర్షపాతం చాలా ఎక్కువగా ఉండి, గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇవి పెరుగుతాయి. ఈ రకం గేదెలు ఎక్కువగా బ్రౌన్ లేదా బూడిద రంగులో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి కొమ్ములు చాలా పొడవుగా ఉంటాయి. రకరకాల షేప్స్ లో కూడా ఉంటాయి. వీటి వెంట్రుకలు ఒళ్లంతా దట్టంగా అలముకొని ఉంటాయి. పెద్ద శరీరం పొట్టి కాళ్లు ఉంటాయి. వీటి కాళ్లు పొట్టిగానే ఉన్నా చాలా బలంగా ఉంటాయి. ఒక్కసారికి ఇవి దాదాపు 500 లీటర్ల పాలను అందిస్తాయి. వీటి పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా 8 శాతానికి పైనే ఉండడం విశేషం.

Toda Breed Buffalo
Toda Breed Buffalo

https://telugu.krishijagran.com/animal-husbandry/best-buffalo-breed-for-highest-milk-production-resistant-to-diseases/

https://telugu.krishijagran.com/animal-husbandry/cows-that-cannot-provide-milk-can-be-the-ultimate-solution-for-many-farmer-s-problems/

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More