ఈ ఏడాది నమోదైన అధిక ఉష్ణోగ్రతలతో, వాతావరణం అట్టుడికిపోయింది. జూన్ నెల నుండి కురుస్తున్న వర్షాలతో ప్రజలు తిరిగి మళ్ళి ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే పశువుల పోషకదారులకు వర్షాకాలం కాస్త గడ్డు కాలమనే చెప్పవచ్చు, ఈ సీజన్లో రోగాలు ప్రభలమయ్యే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పశువుల మీద ఒత్తిడి పడుతుంది, ఫలితంగా పాల దిగుబడిలో తగ్గుదల కనిపిస్తుంది. ఈ కాలంలో పాడిరైతులు అప్రమత్తంగా ఉంది తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది, లేకపోతే పాల నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం మరియు చల్లని గాలుల పశువుల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాతావరణం చల్లగా ఉండటంతో పశువుల్లో రోగాలు ప్రబలుతాయి, అంతేకాకుండా ఈ రోగాలు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువుగా ఉంటుంది. వర్షం కాలంలో ఈగలు, బురద, మరియు అపరిశుభ్రత ఎక్కువవ్వడంతో రోగాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ పరిస్థితుల్లో పాల నాణ్యతను కాపాడుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది.
మన పెద్దలు చెప్పినట్లు నివారణకంటే చికిత్స మేలు అన్నట్లు, పశువుల్లో రోగాలు వచ్చాకా వాటికి నయం చెయ్యడంకంటే ముందే రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇందుకోసం వర్షాకాలం ఆరంభంలోనే కొన్ని వ్యాధులకు టీకాలను అందించాలి. పశువులు మురుగునీరు తాగకుండా ఉండేందుకు, స్వచ్ఛమైన నీటిని ఎల్లపుడు అందుబాటులో ఉంచాలి. పశువులు ఉండే షెడ్ లేదంటే పాకాలను మరియు వాటి పరిసరాలను ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. షెడ్ చుట్టూ మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలి, ;లేకుంటే వీటిలో బాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఈ పరాన్నజీవులును నివారించకడానికి 3-4 మిల్లిలీటర్ల బ్యూటాక్స్, ఒక లీటర్ నీటికి కలిపి షెడ్ చుట్టూ పిచికారీ చెయ్యాలి.
పశువుల మధ్య కనీసం దూరం ఉండేలా చూడాలి, పశువులు దగ్గరగా ఉంటే వ్యాధులు ప్రభలమయ్యే అవకాశం కూడా ఎక్కువుగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో అప్పుడే మొలకెత్తిన పశుగ్రాసం పశువులు తినడం వలన గొంతు వాపు మరియు జబ్బ వాపు వంటి వ్యాధులు రావడానికి ఆవకాశం ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా అడ్డుకునే టీకాలు అందుబాటులో ఉన్నాయి, ఈ టీకాల ద్వారా పశువుల్లో రోగనిరోధక శక్తీ పెరిగి రోగాలను తట్టుకునే శక్తీ లభిస్తుంది. ఈ వర్షాకాలంలో పశువుల్లో వచ్చే మరో ప్రధానమైన వ్యాధి పొడుగువాపు వ్యాధి. ఒక్కసారి పొడుగువాపు వ్యాధి సోకితే పాలాదిగుబడి ఘనీయంగా తగ్గిపోతుంది, తిరిగి మరల కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. వర్షాకాలంలో మురుగునీటిని మరియు పేడను శుభ్రం చెయ్యకపోతే పశువులు వాటి మీద పడుకుంటే, నేలమీద క్రిములు పొడుగులోకి చేరి ఈ పొడుగువాపు వ్యాధికి కారణమవుతాయి. కాబ్బటి పాకాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, ప్రతిరోజు పొడుగును వేడినీటితో శుభ్రం చెయ్యాలి. ఈ విధంగా రైతులు అప్రమత్తంగా ఉంటూ పశువులను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉండాలి.
Share your comments