Animal Husbandry

మండు వేసవి తీవ్రత నుండి కోళ్లను కాపాడు కోవడం లో తీసుకోవలసిన జాగ్రత్తలు:

S Vinay
S Vinay

ప్రతి సంవత్సరం లో వేసవి కాలం వచ్చిందంటే చాలు విపరీతంగా కోళ్లు చనిపోయి కోళ్లఫారాల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండే ఎండలకు కోళ్లు తాళలేక విలవిలలాడుతాయి. దీని ప్రభావం నేరుగా వాటి ఆరోగ్యం పై పడుతుంది.వేసవి కాలం లేయర్లు పెట్టే గుడ్ల సామర్థ్యం పై అనేకమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అయితే కోళ్ల వ్యాపారులు కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ సమస్యలను అధిగమించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

కోళ్లషెడ్డుపై 5 నుండి 10 ఇంచుల వరకు గడ్డిని ఏర్పరుచుకోవాలి. దీనికి పంట కొత్త తరువాత మిగిలిన వ్యర్దాలను ఉపయోగించవచ్చు,ఈ గడ్డికి వీలు చిక్కినప్పుడల్లా నీరుని అందిస్తూ తేమగా ఉండేట్లు చూసుకోవాలి.

కోళ్ల షెడ్డు పరిసర ప్రాంతాల్లో చెట్లను పెంచుకోవడం వల్ల ఎండలు నియంత్రణలో ఉంటాయి.

కోళ్ళకి ఎల్లకాలం తాగునీరుని అందుబాటులో ఉంచాలి దీని కొరకై నీటి ట్యాంకులను నిర్మించుకోవాలి,చల్లని నీరుని అందివ్వటం ఉత్తమం. నిల్వ వుండే నీరును తరుచుగా మారుస్తూ ఉండాలి. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి.

కోళ్ల షెడ్డుపై నేరుగా ఎండ పడకుండా అన్నివైపులా ఏవైనా వస్త్రాలను ఉపయోగించి కప్పిపెట్టుకోవాలి.

కోళ్ళకి అందించే మేత నాణ్యమైనదిగా ఉండాలి అందులో పీచు పదార్థాలు ఉండేట్లు చూసుకోవాలి.

 

లోపల వుండే వేడిని బయటకి పంపించడానికి వెంటిలేటర్లను ఏర్పరుచుకోవాలి.


కాల్షియమ్, జింక్ మరియు విటమిన్ E లు సమృద్ధిగా వున్నా మేతను అందివ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి మరణాల రేటుని తగ్గించవచ్చు .

వీలు కుదిరితే జంతు వైద్యుడి చేత అప్పుడప్పుడు కోళ్లఫారాని పర్యవేక్షించాలి.

పైన వివరించిన సూచనలను పాటించి వేసవిలో వచ్చే ఆటుపోట్లను అధిగమించవచ్చు

మరిన్ని చదవండి.

మామిడి పండ్లను విదేశాలకి ఎగుమతి చేసి మంచి లాభాలను పొందడానికి ఈ సూచనలను పాటించండి.

 

 

 

 

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More