తెలంగాణ రాష్ట్రంలోని 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలకు దరకాస్తులు స్వీకరణకు ప్రకటన ఇచ్చింది DOST. 16 తారీకు మొదలయిన ఫేస్ -1 రిజిస్ట్రేషన్ జూన్ 10 2023 వరకు కొనసాగనుంది.
తెలంగాణ లోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ (JNTU), మహిళా విశ్వ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ కళాశాలల్లో B.A/B.Sc./B.Com./ B.Com. (Voc)/B.Com (Hons)/ BSW/BBA/BAM / BCA కోర్సులలో అడ్మిషన్ ప్రక్రియతో పాటు, TSBTET పాలిటెక్నిక్లలో, D-Pharmacy కోర్సులలో 2023-24 -విద్యాసంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ కూడా దోస్త్ (DOST) తెలంగాణ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నరు.
ఫేస్ - I రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ : 10-06-2023. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల/బోర్డు నుండి సమాన గుర్తింపు కలిగిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. ఒకటి లేదా ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో అన్ని కళాశాలలు/కోర్సులలో ప్రవేశానికి నమోదు చేసుకోవటానికి ఒక్కసారి రుసుము రూ. 200/- చెల్లిస్తే సరిపోతుంది. ఇతర వివరాల కోసం దోస్త్ వెబ్ సైట్ ను సందర్శించండి..
http://dost.cuu.cow.in
ఇది కూడా చదవండి
వీఆర్ఏ ఉద్యోగులకు శుభావార్థ, 23000 ఉద్యోగాలను రెగ్యూలరైజ్ చేయనున్న CM KCR
DOST తో అపరిమిత అవకాశాలు
2022-23 విద్యా సంవత్సరంలో , రాష్ట్రంలోని ఉన్నత కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 5,100 మంది విద్యార్థులకు DOST సహాయం చేసింది.అడ్మిషన్లు పొందిన చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో టాపర్లుగా నిలిచినవారు.ఇంటర్మీడియట్ మెరిట్ అలాగే ఇతర రేజర్వేషన్ల ఆధారంగా కళాశాలలు ప్రవేశం మంజూరు చేయబడుతుంది.
DOST యొక్క కీలక లక్ష్యం "అందరికి ఉన్నత విద్య". మారుమూల గ్రామాల నుండి విద్యార్థులు ఒక బటన్ క్లిక్ చేయడంతో డిగ్రీ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ కళాశాలల నుండి దరఖాస్తు ఫారమ్‌ను పొందడానికి మరియు అడ్మిషన్ల సమర్పించడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, దోస్ట్ విద్యార్థులు చదవాలనుకునే అన్ని డిగ్రీ కళాశాలలకు కేవలం ఒక్క ఆప్ తోనే దరఖాస్తు చేసుకునేలా అవకాశం అందిస్తుంది .
ఇది కూడా చదవండి
Share your comments