Education

నేటి నుండి తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం !

Sriya Patnala
Sriya Patnala
TS Eamcet 2023 Councelling process begins on monday, students need to book slots before july 5
TS Eamcet 2023 Councelling process begins on monday, students need to book slots before july 5

తెలంగాణ లో ఎంసెట్ 2023 కు సంబందించిన కాలేజీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభం అవ్వనుంది. కాబట్టి విద్యార్థులు సోమవారం నుండి జులై 5 వ తేదీ లోగ రుసుము చెల్లించి కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.

తెలంగాణ లో ఎంసెట్ 2023 కు సంబందించిన కాలేజీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభం అవ్వనుంది. కాబట్టి విద్యార్థులు సోమవారం నుండి జులై 5 వ తేదీ వరకు రుసుము చెల్లించి కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.

ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభిస్తారు. విద్యార్థులు జూన్ 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఐచ్ఛికాలను వెబ్సైటు లో నమోదు చేసుకోవచ్చు. ప్రవేశాలు, కోర్సులు, సీట్ల వివరాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ, నోటిఫికేషన్, సహాయ కేంద్రాల సమాచారాన్ని https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని కన్వీనర్ తెలిపారు.

తెలంగాణ లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులలోకి ప్రవేశాల కోసం జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. మొదటి విడత లో మొత్తం 116 కళాశాలల్లో ఉన్న 29,396 సీట్లలో 21,367 సీట్లను భర్తీ చేయడం జరిగింది. ప్రభుత్వ కళాశాలల్లో 87.44 శాతం ,అలాగే ప్రైవేటు కళాశాలల్లో 60. 46 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎన్ సీసీ, క్రీడల కోటా సీట్లను తుది విడత కౌన్సెలింగ్ అనంతరం కేటాయిస్టారు. సీట్లు పొందిన విద్యార్థులు జులై 7 నుంచి 10 వరకు తమ కేటాయించిన కళాశాలల్లో చేరాలని, చేరని వారి సీట్లను రద్దుచేస్తామని కన్వీనర్ తెలిపారు. కళాశాలల్లో జులై 7 నుంచి 14 వరకు పునశ్చరణ జరుగుతుందని, 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.

ఇది కూడా చదవండి

TSPSC Group-4:ఇవే గ్రూప్-4 ఎగ్జామ్ రూల్స్! ఈ వస్తువులు ఉంటే నో ఎంట్రీ..

Related Topics

TS EAMCET 2023 councelling

Share your comments

Subscribe Magazine

More on Education

More