Government Schemes

AP E-Crop: ప్రభుత్వం కీలక నిర్ణయం, వాస్తవ సాగుధారులకే ప్రభుత్వ ప్రయోజనాలు

KJ Staff
KJ Staff

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్య్వవసాయ శాఖ ఇటీవల ఏపి ఈ-క్రాప్ డిజిటల్ వెబ్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. ఇక ఈ వెబ్సైట్లో రైతుల వివరాలు నమోదు చెయ్యవలసి ఉంది. దీని ద్వారా వ్యవసాయ దారులకు బహుళ ప్రయోజనాలు అందించనున్నారు. ఇప్పటికే ఈ- క్రాప్ వెబ్సైటులో రైతుల వివరాలను రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. దీని పట్ల రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు.

అసలైన రైతులకు మాత్రమే లబ్ధిచేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వాస్తవ సాగుదారులను మాత్రమే నమోదు చెయ్యాలని ఏపి ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదేశించారు. ఈ- క్రాప్ ఆప్ లో రైతులు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా, ప్రభుత్వం అందించే అన్ని పథకాలను అర్హత ఉన్న రైతులకు అందించడం సులభతరమవుతుంది. ఈ- క్రాప్ వెబ్సైటు ద్వారా పంట భీమా, వడ్డీలేని పంట రుణాలు, కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తి అమ్మకాలు మొదలైన అవకాశాలు కల్పిస్తారు.

ఈ- క్రాప్ వెబ్సైటులో పంట పండించడం దగ్గర నుండి, పంట విక్రయించడం వరకు సమాచారం అంతా ఒకేచోట లభిస్తుంది కాబట్టి, రైతులకు లభిచేకూరుతుంది, కాబట్టి రైతులంతా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. NIC సహకారంతో అదనపు ఫీచర్లను జోడించి, రైతుల సమగ్ర వివరాలు మరియు సర్వే నెంబర్ సహాయంతో జియో ఫెన్సింగ్ చేస్తారు, దీనితో పంట సాగు వివరాల నమోదులో ఖచ్చితత్వాన్ని ఎక్కువ అవకాశం ఉంటుంది. నమోదు చేస్తున్న సమయంలో, పొలాన్ని సాగు చేస్తున్న అసలైన రైతులను గుర్తించి సాగు చేస్తున్న రైతులను క్షేత్ర స్థాయిలో గుర్తించి వారిని మాత్రమే నమోదు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సిబందిపై కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

ఈ ప్రక్రియను సజావుగా పూర్తిచెయ్యడానికి వ్యవసాయ, ఉద్యాన, సర్వే, రెవిన్యూ అధికారులంతా సమగ్రంగా పనిచేసి, ప్రతిరోజు కనీసం వారి పరిధిలోని 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన మరియు నమోదు పూర్తి చెయ్యాలని అధికారులకు సూచించారు. ఆప్ లో నమోదైన వివరాలతోపాటు, జియో కోఆర్డినెట్స్ సహాయంతో పంటల ఫోటోలు తీసి అప్లోడ్ చెయ్యాలని అధికారులకు సూచించారు. రైతులు అందించిన సమాచారం ఆధారంగా నమోదు చేసిన వివరాలను ద్రువీకరించి రైతుల వేలిముద్ర తీసుకోగానే ఆప్ ద్వారానే సంబంధిత రైతు ఫోన్ నెంబర్ కు రసీదును జారీ చేస్తారు.

Share your comments

Subscribe Magazine