
మార్చ్ 12 నుండి ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ సాగు పరికరాల కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ పరికరాల కోసం వ్యవసాయదారులు, తమ సమీప రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి. వ్యవసాయ సహాయకుడి సహకారంతో రైతులు వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి అంటే అగ్రికల్చరల్ ఆఫీసర్ నుండి నిర్ధారణ పొంది, ఆ తరువాత వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు దగ్గరకి వెళ్ళాలి. అక్కడ కూడా అప్రూవ్ పొందిన వెంటనే, రైతులకు వ్యవసాయ సాగు పరికరాలు, మరియు యంత్రాలు మంజూరు చేస్తారు. ఈ సేవలని మార్చ్ 26వ తారీఖు లోపల రైతులు ఉపయోగించుకోగలరు.
ఈ సంవత్సరానికి గాను జిల్లాకు 1,697 యూనిట్లని చంద్రబాబు కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం కోసం వ్యవసాయదారులు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఈ పరికరాలను రైతులు తమ సొంత అవసరాలకు వాడుకోవడంతోపాటు తోటి రైతులకు కూడా తగినంత ధరతో పంచుకునే అందించే అవకాశం వుంది.
అలానే సుమారు 2.20 లక్షల ఎకరాల సాగు భూమి కలిగిన పార్వతి పురం మన్యం జిల్లాలో 1.44 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరికి రాష్ట్రం లోనే గరిష్టంగా ప్రభుత్వం యంత్ర పరికరాలపై 50% రాయితీపై ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
ఇలా సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు కావాలనుకుంటే ఈ నెల 26వ తేదీలోగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమిని సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులు, సన్న, చిన్నకారు రైతులు దరఖాస్తు ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చు.
ప్రస్తుతానికి ఒక్కో జిల్లాకు పవర్ వీడర్లకు రూ.5.25 లక్షలను సబ్సిడీగా లభించనుంది. బ్యాటరీ స్ప్రేయర్లకి 450 కేటాయించగా, ప్రతీ పరికరానికి రూ.1000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్ పనిముట్లకు రూ.1.92 కోట్లను సబ్సిడీగా కేటాయించింది. అలానే తైవాన్ స్ప్రేయర్లకి కు రూ.36 లక్షలను సబ్సిడీగా ఇవ్వనుంది. రోటోవేటర్లకు రూ.11.50 లక్షలను సబ్సిడీగా ఇవ్వనుంది. బ్రష్‌కట్టర్‌లకు అయితే రూ.3.60 లక్షలను సబ్సిడీగా ఇవ్వనుంది.
- ఎవరెవరు అర్హులు?
- పట్టాదారు పాస్ బుక్ కలిగి ఉండి, ఈ-పంట నమోదు చేసుకున్న సాగుదారులు.
- అలానే ఆర్ వో ఎఫ్ ఆర్ భూములు సాగు చేస్తున్న వారూ అర్హులే.
- ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు
- SC,ST, మహిళలు, సన్న కారు రైతులు.
- గత ఐదేళ్లుగా ఎటువంటి వ్యవసాయ యంత్రాలను పొందని వారు.
- ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే అవకాశం.
- ఇంకా అందే పరికరాలు:
- దుక్కి ట్రాక్టర్
- పవర్ టిల్లర్లు
- పవర్ వీడర్లు
- బ్యాటరీ
- ఫుట్
- రోటోవేటర్లు
- దమ్ము సెట్లులు
- తైవాన్ స్ప్రేయర్లులు.
Share your comments