రబీ పంట సాగు చివరి దశలో ఉంది. ఖరీఫ్ పంట సాగుకు రైతులు సన్నాహాలు చేస్తుండగా, కేంద్రం ఒక శుభవార్తతో ముందుకు వచ్చింది. ప్రతి పంట సాగుకు అతి ముఖ్యమైన భాస్పరం, పోటాష్ ఎరువులపైనా సబ్సిడీని ఆమోదిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు ఎరువులతో పటు మరో మూడు ఎరువులను ఈ జాబితాలో చేర్చబోతుంది. ఈ సబ్సిడీ ద్వారా పంటలకు అవసరం అయ్యే ఎరువులను తక్కువ ధరకే రైతులు పొందవచ్చు.
పంటకు అతి ముఖ్యమైన నత్రజని పైన సబ్సిడీని కేంద్రం ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది. ఇదే తరహాలో పంట ఎదుగుదలలో అతి కీలక పాత్ర పోషించే భాస్ఫారమ్, పోటాష్ పైన కూడా కేంద్రం సబ్సిడీకి ఆమోదం తెలిపింది. అమల్లోకి వచ్చిన ఈ సబ్సిడీ ద్వారా పంటకు వినియోగించే ఎరువులు సరసమైన ధరలకే రైతులకు లభించబోతున్నాయి. దీని ద్వారా రైతులపై ఖర్చుల భారం తగ్గనుంది. ఈ సబ్సిడీ లిస్ట్ లో మరో మూడు ఎరువులు చేర్చే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా ఆమోదించిన ఈ సబ్సిడీ వచ్చే ఖరీఫ్ సీజన్లో అమలులోకి రాబోతుంది. తగ్గుతున్న ఖర్చు, మరియు సులభంగా లభ్యమయ్యే ఎరువుల ద్వారా పంట దిగుబడి పెరిగి, రైతులు మంచి లాభాల్ని పొందవచ్చు.
మొత్తం 25 రకాల భాస్ఫారమ్ మరియు పోటాష్ ఎరువులు, రైతులకు సబ్సిడీలో లభ్యం కాబోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో N,P,K ఎరువులకు ఉన్న రేటును బట్టి ఈ సబ్సిడీ కేటాయించబడుతుంది. ఎరువుల లభ్యతలో అధిక మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించి, రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గిస్తుంది.
Share your comments