రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాలతో రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. రైతులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు తుఫాన్లు, వరదలతో పంటలు నష్టపోయినప్పుడు ఆదుకునేందుకు పంట బీమా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అలాంటి బీమా పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. ప్రధానమత్రి ఫసల్ బీమా యోజన పథకం
ఈ పథకం ద్వారా పంట నష్టపోయినప్పుడు రైతులు బీమా పొందవచ్చు. 7 రకాల పంటలకు ఇందులో బీమా పొందవచ్చు. ఈ పథకంలో గ్రామాన్ని యూనిట్‌కి తీసుకుంటారు. దీనికి రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరికొంత ప్రీమియం చెల్లిస్తాయి.
ఈ బీమా పొందాలంటే ఏం చేయాలి?
-రైతు భరోసా కేంద్రాల్లో దీనికి అప్లే చేసుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండే వ్యవసాయ అసిస్టెంట్లను సంప్రదించాలి.
-విిత్తనం వేసిన 10 రోజుల్లోనే వ్యవసాయ అసిస్టెంట్ దగ్గర నమోదు చేయించుకోవాలి
-భూమి పత్రాలు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది
-అలాగే పీఎంఎఫ్ బివై వెబ్‌సైట్‌కి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు
Share your comments