వ్యవసాయ రంగం లో రైతులకు పంటలు సాగు మాత్రమే కాకుండా పాడి పశువుల పోషణ, వంటి వాటి ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఈ మేరకు పశుపోషణ చేసే రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వారికీ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది.
కిసాన్ క్రెడిట్ కార్డు మాదిరిగానే, పశుపోషణ చేసే రైతులకు ఆర్ధిక ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం - పఃసు క్రెడిట్ కార్డు. ఈ పథకం ద్వారా పాడి పరిశ్రమ, మత్స్య రైతులకు రుణ సధుపాయం అందిస్తున్నారు. యానిమల్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద ప్రభుత్వం పశుపోషణ , ఆవులు, గేదెల కొనుగోలు లేదా నిర్వహణ కోసం ప్రభుత్వం రైతులకు రూ.1.60 లక్షల రుణాన్ని ఎటువంటి హామీ అవసరం లేకుండా అందజేస్తోంది .
ఈ పథకం ద్వారా ,రైతులు / పశువుల యజమానులు గరిష్టంగా ₹3 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. ₹1.6 లక్షల వరకు రుణం కోసం ఎలాంటి హామీ అవసరం లేదు . ఈ పథకం ద్వారా ఆవుకు ₹40,783, ఒక్కో గేదెకు ₹60,249, మేకలు మరియు గొర్రెలకు ₹4063 అందిస్తుంది. ఇంకా, PKCC పథకం కోళ్లకు ₹720 అందిస్తుంది. పశు క్రెడిట్ కార్డుపై లభించే రుణంపై మాములుగా రైతులు 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ .. రైతు సరైన సమయంలో రుణాన్ని తిరిగి చెల్లించినట్లయితే .. 3 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుంది . అంటే.. రైతు తన తీసుకున్న రుణంపై కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
పశు క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణాన్ని రైతులు 5 సంవత్సరాల లోపు బ్యాంకు కు చెల్లించాల్సి ఉంటుంది. రైతులు పశు క్రెడిట్ కార్డును పొందాలనుకుంటే.. మీ సమీపంలో బ్యాంకుకు వెళ్లి, అక్కడి అధికారుల సహకారంతో అప్లికేషన్ పూర్తి చేసి, అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా కార్డును పొందవచ్చు. దరఖాస్తు చేసిన నెల రోజుల లోపు లోపు పశు క్రెడిట్ కార్డు మీకు లభిస్తుంది.
ఇది కూడా చదవండి
Share your comments