News

రైతుబంధు కటాఫ్ డేట్ ఫిక్స్ ... జూన్‌ 16 కటాఫ్ డేట్!

Srikanth B
Srikanth B
రైతుబంధు కటాఫ్ డేట్ ఫిక్స్ ... జూన్‌ 16 కటాఫ్ డేట్!
రైతుబంధు కటాఫ్ డేట్ ఫిక్స్ ... జూన్‌ 16 కటాఫ్ డేట్!

ఇంక 5 రోజులలో రైతుబంధు డబ్బులు జమకానున్న క్రమంలో రైతుబంధు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులకు కటాఫ్ తేదీని నిర్ణయించింది ప్రభుత్వం జూన్ 16 2023 నాటికి కొత్త పాస్​బుక్ పొందిన ప్రతి రైతుకూ రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

కొత్త గ పట్టా పాస్​బుక్ పొందిన ప్రతి రైతు పెట్టుబడి సాయం కోసం పట్టాదారు పాస్​బుక్, ఆధార్​కార్డు, బ్యాంకు పాస్​బుక్ జిరాక్స్ కాపీలను ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. 2022 జూన్ 5 నుంచి 2023 జూన్ 16 దాకా జరిగిన సాగు భూముల రిజి స్ట్రేషన్ల డేటాను వ్యవసాయ శాఖకు సీసీఎల్ఏ తాజాగా అందించింది. ఈ డేటా ఆధా రంగా ఏఈవోలు కొత్తగా రైతుబంధు లబ్ధిదారులను ఎంపిక చేసేం దుకు పోర్టల్​లో ఎంట్రీ చేయనున్నారు.

సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. ప్రస్తుతం సీసీఎల్ఏ డేటా ఆధారంగా 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు సమాచారం .


అతి త్వరలో రైతు బంధు పంట సాయాన్ని విడుదల చేసే కార్య కలాపాల్లో ప్రభుత్వం నిమగ్నమైయున్న ప్రభుత్వం,కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు రైతుబంధు పోర్టల్లో నమోదైన వివరాలను/ తప్పిదాలను నవీకరణ చేసేందుకు అవకాశం కల్పించింది.

పీఎం కిసాన్ 14 వ విడత రావాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాల్సిందే ..!

పోర్టల్ లో బ్యాంకు ఖాతా వివరాల సవరణ :
రైతుబంధు పోర్టల్లో పంట రుణ ఖాతా కాకుండా వేరే బ్యాంకు ఖాతాను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనికి రైతులు ఏఈవోకు దరఖాస్తు చేసుకుంటే వ్యవసాయ శాఖ అధికారులు వివరాలను పరిశీలించి సవరణను ఆమోదిస్తారు .మీ ఫోన్ నంబరును అలాగే కొత్త బ్యాంకు ఖాతా ఉన్నట్లయితే దానిని కూడా పోర్టల్ లో నమోదు అవకాశం ఉంది.

పీఎం కిసాన్ 14 వ విడత రావాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాల్సిందే ..!

Related Topics

rayithubandu

Share your comments

Subscribe Magazine