News

పీఎం కిసాన్ 14 వ విడత రావాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాల్సిందే ..!

Srikanth B
Srikanth B

పీఎం కిసాన్ 14 వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా లో పీఎం కిసాన్ 14 వ విడత పొందాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయవల్సిన పనుల గురించి కీలక అప్డేట్ విడుదల చేసింది.

రైతులు చేయాల్సిన 3 కీలక అప్డేట్ లు :

1)ల్యాండ్ డాకుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి .

2)ఆధార్ కార్డును బ్యాంకు అకౌంట్ నెంబర్ తో లింక్ చేయించాలి .

3)మీ ekyc ప్రక్రియను పూర్తి చేయాలి .


ఈ మూడు అప్డేట్ లు చేయని రైతులు పీఎం కిసాన్ 14 వ విడత డబ్బులను పొందారు . ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత ప్రయోజనాలను పొందేందుకు, కిసాన్ అధికారిక వెబ్‌సైట్ http://pmkisan.gov.inలోపైన పేర్కొన్న ప్రక్రియను పూర్తి చేయాలనీ అగ్రికల్చర్ ఇండియా తన అధికారిక ఖాతాలో పీఎం కిసాన్ 14 విడత కీలక అప్డేట్ ను విడుదల చేసింది .

రానున్న రెండు ,మూడు రోజులలో రుతుపవనాలు .. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ !

మీ మొబైల్ ఫోన్ ద్వారా ekyc ఎలా చేయాలి ?

ఇప్పుడు రైతులు కేవలం ప్లే స్టోర్ లో వెళ్లి పీఎం కిసాన్ యాప్ ను డౌన్లొడ్ చేసుకొని సంబందించిన మీ ఆధార్‌ నంబరు నమోదు చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఆధార్‌కు లింక్ లేని నంబరుకు ఓటీపీ రాదు. పీఎం కిసాన్‌ దరఖాస్తు చేసినప్పుడు ఏ నంబరు ఇస్తే దానికి మాత్రమే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ప్రక్రియ పూర్తి చేసి ముఖ ఆధారిత హాజరు ఆప్షన్ వస్తుంది అందులో ముఖం చూపుతూ కళ్లు కదిలించాలి అంతే మీకు సంబందించిన వివరాలు అన్ని సరైనవై ఉంటే e -kyc ప్రక్రియ పూర్తవుతుంది.


పీఎం కిసాన్:

రైతులకు పెట్టుబడి సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ , రైతులకు 3 దఫాలలో సంవత్సరానికి 6000 పెట్టుబడి సాయం అందించే ఈ పథకం క్రింద ఇప్పటివరకు 13 విడతలలో రైతులకు సాయం అందించింది ప్రభుత్వం ఇప్పుడు 14 వ విడత ద్వారా రైతులకు మరో 2000 ఆర్థిక సాయాన్ని అందించనుంది , అయితే పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రైతులు e-kyc ప్రక్రియ తో పాటు ల్యాండ్ డాకుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి ,ఆధార్ కార్డును బ్యాంకు అకౌంట్ నెంబర్ తో లింక్ చేయించాలి .

రానున్న రెండు ,మూడు రోజులలో రుతుపవనాలు .. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ !

Related Topics

pmkisan

Share your comments

Subscribe Magazine