భారత దేశంలోని మహిళలను, ఆర్ధికంగా బలపరచి, స్వీయ ఆధారితంగా మార్చాలన్న ఉదేశంతో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డ్రోన్ దీదీ స్కీం ను ప్రవేశపెట్టారు.ఈ స్కీం కు అర్హత సాధించడానికి అవసరమైన వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.
డ్రోన్ దీదీ స్కీం:
మహిళలు ప్రతీ రంగంలోనూ పురుషులతో సమానంగా, పోటీ పడుతూ, తమ నైపుణ్యంతో అత్యుత్తమ, విజయాల్ని, ఘనతను సాధిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో, మహిళల పాత్ర ఎంతో కీలకం. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇంటి పనులతో పాటు వ్యవసాయ పనుల్లో కూడా ఎక్కువుగా పాల్గుతుంటారు. గ్రామీణ మహిళలను, లక్షాధికారులుగా మార్చేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ ఈ డ్రోన్ దీదీ స్కీం ను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం ప్రకారం, మొత్తం, 15,000 మంది స్వయం సహకరిక సంఘాల మహిళలకు, డ్రోన్ల, పనితీరుపై మరియు వాటిని నడపడానికి అవసరం అయ్యే శిక్షణను ఇస్తారు. ఈ కార్యక్రమానికి మొత్తం, రూ. 1261 కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టనున్నారు.
గ్రామాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కలిపించే దిశగా, ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 30, 2023 న డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 15,000 డ్రోన్లు, దేశములోని వివిధ స్వయం సహాయక సంగాల మహిళకు అందించనున్నారు. వ్యవసాయ వినియోగాలకు అనుగుణంగా ఈ డ్రోన్లను రూపొందించడం జరిగింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారీ చెయ్యడం ద్వారా, మనుషులపై దుష్ప్రభావాలను నియంత్రిచవచ్చు, మరోయు అధిక మందుల వినియోగాన్ని తగ్గించవచ్చు.
స్కీం ను పొందడానికి కావాల్సిన అర్హతలు:
ఈ క్రయక్రమానికి నమోదు చేసుకునే మహిళలు, గ్రామీణ మాహిళలై, స్వయం సహకారిక సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండాలి. భారత సభ్యత్వం నిరూపించడానికి అవసరం అయ్యే ఆధార కార్డు, అకౌంట్ పాసుబుక్, పాస్పోర్ట్ సైజు ఫోటులు, పాన్ కార్డు మరియు ఈ-మెయిల్ ఐడి ఈ స్కీం కు కావాల్సిన డాక్యూమెంట్లు. అప్లికేషన్ వివరాలను, మరియు అప్లికేషన్ పోర్టల్ కొన్ని రోజుల్లో వెల్లడించనున్నారు.
Share your comments