కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు ఇంకా పథకాలను అమలులోకి తీసుకువస్తున్నాయి. ఈ పథకాలతో రైతులకు పంటలు పండించడానికి ఆర్ధికంగా సహాయపడటం వలన వారికి సాగుపై భరోసా కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పథకాల్లో ఒకటి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతులకు ఈ పథకం ద్వారా మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి 6000 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం యొక్క 13వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు రైతులు 14వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన పథకం పేరు ‘PM కిసాన్ FPO యోజన’. రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడి మరియు వారికి స్వావలంబన సాధించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం వ్యవసాయం ప్రారంభించాలి అనుకునే వారికి ఉపయోగపడుతుంది. రైతులు సొంతంగా వ్యవసాయాన్ని ప్రారంభించేందుకు ఈ పథకం ద్వారా రైతులకు 15 లక్షల రూపాయలను అందిస్తుంది.
ఇది కూడా చదవండి..
మహిళలకు శుభవార్త: ఈ నెల 12న వారి ఖాతాల్లోకి రూ.15 వేలు..
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రారంభిస్తే వారికి రూ.15 లక్షలు అందిస్తుంది. 11 మంది రైతులు కలిసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ప్రారంభించాలి. ఆ తరవాత ఈ స్కీము కింద రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, ఎరువులు, విత్తనాలు మొదలైనవి కొనుగోలు చేయడం ఈజీ అవుతుంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీరు ఈ ప్రక్రియ ని పూర్తి చేసుకోవచ్చు.
నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసాక.. హోమ్ పేజీలో ఇచ్చిన FPO మీద క్లిక్ చేయండి.
ఆ తరవాత రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫారమ్‌లో మీ యొక్క సమాచారాన్ని ఇచ్చేసి… పాస్‌బుక్ అప్‌లోడ్ చేయండి.
ఫారం పూర్తి చేసేసి.. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
దీని తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన FPO ఎంపికపై క్లిక్ చేయండి.
లాగిన్ ఫారమ్ ఓపెన్ చేసి పేరు పాస్‌వర్డ్ మరియు క్యాప్చా కోడ్‌ను మీరు ఎంటర్ చేయండి. దీనితో మీరు లాగిన్ అవుతారు. ఇలా లాగిన్ చేసేయచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments