రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే రైతులకు అండగ నిలువడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడానికి పెట్టుబడి అనేది అత్యంత ముఖ్యమైనదని పేర్కొంటూ రైతుల కోసం పలు పథకాలను తీసుకువచ్చింది. అందులో ఒకటి రైతు బంధు పథకం. ఈ పథకం ద్వారా సాగు ప్రారంభ పెట్టుబడిని ప్రభుత్వం రైతులకు అందిస్తోంది.
రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతులకు తాజాగా శుభవార్తను అందించింది. రైతు బంధు పథకం కింద అందే పెట్టుబడి సాయాన్ని ఈ నెలలో అందిస్తామని తెలిపింది. ఈ ఈ నెల చివరి లో రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని అందించనుట్లు సమాచారం.
ఈ సంవత్సరం రైతు బంధు పథక లబ్దిదారులు 63.25 లక్షల మంది ఉన్నట్లు ఇప్పటికే రైతు బందు కు అవసరమైన నిధులు రాష్ట్ర సర్కార్ కు సమకూరినట్లు సమాచారం, అర్హులైన రైతులకు ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారలో పెట్టుబడి సాయం అందనునట్లు సమాచారం.
రైతులకు శుభవార్త: PM కిసాన్ 12వ విడత ఈ నెలల లో రానున్నది !
ఈ ఏడాది కొత్తగా 2.81 లక్షల మంది రైతులను రైతు బంధు పథకంలో చేర్చామని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి 7508.78 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. కొత్తగా ఈ పథకం ప్రయోజనాలు పొందుతున్న రైతులు స్థానిక వ్యవసాయ అధికారులకు భూమి సంబంధిత వివరాలు, రైతు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీలను అందజేయాలని వివరించారు. అలాగే, ఇది వరకే రైతు బంధు పథకం ప్రయోజనాలు పొందుతున్న రైతులు బ్యాంకు ఖాతాల వివరాలు మార్చుకోవాలనుకుంటే కొత్తగా సంబంధిత పత్రాలను స్థానిక వ్యవసాయ అధికారులకు అందించాలని ప్రభుత్వం పేర్కొంది.
Share your comments