2024-25 బడ్జెట్ లో భాగంగా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, "ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముప్త్ బీజలి యోజన" స్కీం ను ప్రవేశ పెట్టారు. ఎవరయితే సోలార్ రూఫ్ టాప్ ద్వారా సూర్యాయ రశ్మి నుండి విద్యుతున్ని ఉత్పత్తి చెయ్యాలి అనుకుంటారో వాళ్ళకి ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది. సోలార్ రూఫ్ టాప్ ను ఇంస్టాల్ చేసుకోవడాం ద్వారా, మీరు ప్రతి నేలా పే చేసే కరెంటు బిల్ ను తాగించుకోవచ్చు. ఈ స్కీం సంబంధించిన మరిన్ని విషయాలు వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం తెలుసుకుందాం.
పెరుగుతున్న విద్యుత్ వినియోగం, దాని వాళ్ళ కలుగుతున్న పర్యావరణ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఒక కొత్త ఉపాయంతో ముందుకు వచ్చింది. "ప్రధాన మంత్రి ఉచిత విద్యుత్ యోజన", 2024-25 బడ్జెట్ ను పార్లిమెంట్లో ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ స్కీం గురించి ప్రస్తావించారు. ఈ పథకం కింద ఇంటి పై కప్పు మీద ఏర్పాటు చేసుకున్న సోలార్ పానెల్స్ ద్వారా, ఇంటి అవసరాల కోసం విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ స్కీం కి అనుగుణంగా కేంద్రం అవసరమైన సబ్సిడీలను, మరియు రాయితీలను, మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది.
ప్రతి నెలా 300 యూనిట్ల ఉచితం:
PM ఉచిత విద్యుత్ యోజన ప్రకారం దేశమలోని దాదాపు అన్ని ప్రదేశల్లోని ఇళ్లను వెలుగులతో నింపే విధంగా ఈ స్కీం పనిచేస్తుంది. ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల కర్రెంట్ను ఈ స్కీం ద్వారా అందిస్తారు. సూర్య రశ్మితో కరెంటు ను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రభుత్వం పై భారం తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
దీని వాళ్ళ కలిగే ఉపయోగాలు:
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు, మరియు ఎలక్ట్రిక్ కార్లు క్రజ్ ఎక్కువగా కనిపిస్తుంది. గాలిలోకి విడుదల అయ్యే కార్బన్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులను తగ్గించడం ఎక్కువవుతున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగించే విద్యుత్ ఉత్పత్తిలో మాత్రం ఈ కాలుష్యాన్ని అరికట్టలేకపోయాం. ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్ ఉండటం వల్ల , విద్యుత్ ఉత్పత్తి కంపెనీల పై భారం తగ్గి, అదనంగా ఉత్పత్తి చేయవలిసిన విద్యుత్ను తగ్గించవచ్చు. అంతే కాకుండా కొత్తగా నిర్మించబోయే సోలార్ పానెల్స్ కర్మాగారాలు మన దేశములోని యువతకు, ఉపాధి కల్పించడంలో తోడ్పడ్తాయి.
అర్హులు ఎవరు?
ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు పేద మరియు మధ్య ఆదాయ కుటుంబానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తుదారులు వారి స్వంత నివాసాన్ని కలిగి ఉండాలి.
సబ్సిడీ వివరాలు:
రూఫ్ టాప్ సోలార్ పానెల్స్ అమర్చుకునేందుకు, ప్రభుత్వం భారీగా సబ్సిడీలను అందిస్తుంది. ముందుగా 2KW వరకు ప్రతి KW కు రూ. 30000/- అధిక సామర్ధ్యం కలిగిన 3KW అమర్చుకునేందుకు ప్రతి KW కు రూ 18000-/, అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న సోలార్ సిస్టం పానెల్స్ అమర్చుకోవడానికి గరిష్టంగా 78,000 రూ వరకు కేంద్రం అందిస్తుంది.
స్కీం వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి https://services.india.gov.in/service/detail/apply-for-rooftop-solar-ministry-of-new-and-renewable-energy Apply For RoofTop అనే బటన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
Share your comments