రైతులు, మత్స్యకారులు, ఇతర హస్త కళా నిపుణులు ఒక సమూహంగా ఏర్పడి, తమ ఉత్పత్తులని వికృయించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నావ్ ఈ రైతు ఉత్పత్తి సమస్థలు(FPO) వీటినే ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అని కూడా పీలుస్తూ ఉంటారు.
FPO వల్ల ఉపయోగాలు :
భారతదేశంలోని చిన్న మరియు మధ్యతరహా, రైతుల శాతం ఎంతో ఎక్కువ. 86% శాతం కంటే ఎక్కువ మంది రైతులు 1.1 హెక్టార్ భూమి కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. తక్కువ భూమి, మరియు తక్కువ ఉత్పాదన వల్ల, వారి పంటలకు కనీస గిట్టుబాటు ధర లభించక ఎన్నో కష్టాలను ఎదురుకుంటున్నారు. ఈ పరిస్థినతిని నియంత్రించి, రైతులు పండించే పంటలకు మంచి గిట్టుబాటు ధరను అందించే నేపథ్యంలో రూపొందించినవే ఈ FPO'S. రైతులు అంత ఒక సమూహం గా ఏర్పడి, తమ పంటలను ఒకే సరి వికృయించుకోవచ్చు. వ్యవసాయాన్ని అవసరమా అయ్యే ఎరువులు, పురుగుమందులు, మరియు ఈ ఇతరమైన వ్యవసాయ అవసరాలయిన సరే ఎక్కువ స్థం లో కొనుగోలు చేసి డబ్బు ను ఆదా చేసుకోవచ్చు.
మహిళా రైతుల సహకారం:
FPO లు విజయవంతంగా ముందుకు సాగడానికి మహిళా రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పూర్తి శ్రామిక శక్తిలో 75% మహిళా రైతులే ఉన్నారు. అయినా కానీ పురుషులకు ఉన్నత ప్రాధాన్యం మహిళలలకు లేదు. లింగ అసమానతలు, మహిళా భాగస్వామయినికి సంబంధించిన డేటా అందుబాటులో లేకపోవడం వీటికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. 75% శాతం శ్రమదానం చేస్తున్న మహిళలను విస్మరించండం ఎంతవరకు సమంజసం?
మార్పు అవసరం:
FPOలో ఈ అవకతవకలు తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న పోలీసైలో కొన్ని కీలక మార్పులు అవసరం. ముఖ్యముగా ప్రతి FPO గ్రూప్ బోర్డ్ మెంబెర్ గ ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను ఉంచడం వాళ్ళ మహిళా ,అభున్నతికి కారణం అవుతుంది. పురుషులతో పాటు మహిళా రైతులకు సమాన వేతనాలు ఇచేలా చర్యలు చేపట్టాలి. ఈ విధమైన సవరణలు చెయ్యడం వాళ్ళ మహిళా రైతుల ఆదాయం పెరిగి వారి కష్టాన్ని గుర్తించినట్టు అవుతుంది
Share your comments