భారతదేశంలో వివిధ రకాల భీమాల పట్ల ప్రజలలో అవగాహన బాగా పెరిగింది. జీవిత భీమా, ఆరోగ్య భీమా విధముగా ప్రమాద భీమా తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ తరహాలో వివిధ భీమాలను అందిస్తున్న తపాలా శాఖ (పోస్టల్ డిపార్ట్మెంట్) నేడు ఒక ప్రమాద భీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పధకాన్ని టాటా ఏఐజితో (టాటా ఏఐజి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ) దీనిని ప్రారంభించింది. ఈ ప్రమాద భీమా పధకం వినియోగదారులు కేవలం 399 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే, 10 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం పొందవచ్చు. అంటే రోజుకు, ఒక రూపాయి కంటే కొంచెం ఎక్కువ చెల్లించి, ఈ ప్రమాద భీమా కవరేజికి పొందవచ్చు.
ఈ భీమాకి అర్హులుగా 18 నుండి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఏ ఒక్కరైనా ఈ భీమా పాలసీని పొందవచ్చు. ఈ పథకం యొక్క ప్రీమియంని చెల్లించాలి అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా మాత్రమే చెల్లించాలి. కాబట్టి ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉంటేనే ఈ భీమాను తీసుకోవడానికి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వారు ప్రమాదంలో మరణించినా, ఏదైనా అవయవం కోల్పోయినా, పక్షపాతం వచ్చినా లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన వెంటనే 10 లక్షల రూపాయలను చెల్లిస్తారు.
ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా ప్రమాదానికి గురయ్యి, ఆసుపత్రిలో చేరితే ఐపిడి(ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్) కింద 60 వేళా రూపాయలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఎంత తక్కువ ఐతే అది చెల్లిస్తారు. ఔట్ పేషెంట్ విషయంలో 30 వేల రూపాయలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఎంత తక్కువ ఐతే అది చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి..
స్మాల్ సేవింగ్స్ స్కీం : ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా మెరుగైన పథకం
ఈ పాలసీతో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనగా గరిష్టంగా ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు. కుటుంబ ప్రయోజనం కింద 25 వేల రూపాయలు, అంత్యక్రియల కోసం మరో 5 వేల రూపాయలు అందుతాయి. ఆసుపత్రిలో చికిత్స సమయంలో, రోజువారీ నగదు రూపంలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు ఇస్తారు.
ఇదే పథకాన్ని 299 రూపాయల ఆప్షన్తోనూ తపాలా శాఖ అందిస్తోంది. దీనిని ఎంపిక చేసుకుంటే, ఏడాదికి 299 రూపాయలు చెల్లించినా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణం, వైకల్యం, పక్షవాతం, వైద్య ఖర్చులు వంటివి ఈ ఆప్షన్లో కవర్ అవుతాయి. పైన చెప్పుకున్న అదనపు ప్రయోజనాలు మాత్రం దీనికి అందవు.
ఇది కూడా చదవండి..
Share your comments