ఉపాధి అవకాశాల కోసం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం యువ తరానికి చురుకుగా మద్దతు ఇస్తోంది. అలాంటి వాటిల్లో కోళ్ల ఫారం బిజినెస్ కూడా ఒకటి. పౌల్ట్రీ వ్యాపారాల స్థాపనను ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం ఒక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రజలు ఎవరైనా కోళ్ల ఫారం బిజినెస్ చేయాలనుకుంటే, కేంద్ర ప్రభుత్వం వారికి 50 శాతం రాయితీపై రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం అందిస్తుంది.
నేటికాలంలో ప్రజలు ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే డైలీ షెడ్యూల్ కి విసికిపోయారు. ఇలా చెయ్యడం వల్లన ఇదేనా జీవితం అనిపిస్తోంది. ఇంటికి దూరంగా వదిలి ఉంటె, ఎదో తెలియని అసంతృప్తి కలవర పెడుతుంది. చాలా మంది ప్రజలు తమ సొంత ఊరిలో ఏదొక వ్యాపారం చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అలా అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిటికి మాత్రం ప్రభుత్వాలే ఆర్థిక సాయం చేస్తున్నాయి.
వ్యవసాయంతో పాటు, పౌల్ట్రీ పరిశ్రమపై ప్రత్యేక ఆసక్తితో వ్యవసాయ పరిశ్రమలోని వివిధ రంగాలను రైతులు ఎక్కువగా అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా కోళ్లపరిశ్రమ యువకులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతోంది. దీనితో యువత కూడా ఈ పరిశ్రమపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. చికెన్ కి డిమాండ్ ఎక్కువగా పెరగడంతో కోళ్ల ఫారం పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇది కూడా చదవండి..
రైతుల ఖాతాల్లో జమ కాకుండా రుణమాఫీ సొమ్ము వెనక్కి.. కారణం ఇదే?
కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిశ్రమను ప్రారంభించే ప్రజలకు రుణ సహాయాన్ని అందిస్తుంది. వారికి 50 శాతం సబ్సిడితో రూ.50 లక్షల వరకు రుణ సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్యక్రమం జాతీయ లైవ్ స్టాక్ మిషన్, కేంద్ర పశుసంవర్ధక మరియు డెయిరీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంది. ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల ఫారం స్థాపించాలి అనుకునే వారికి ఎవరికైనా కల్పిస్తోంది.
వ్యక్తిగతంగా లేదా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలు, రైతు సహకార సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు మరియు వివిధ కంపెనీలు వంటి వివిధ సంస్థలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులువుగా పూర్తి చేయవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల ఫారాలను ఏర్పాటు చేయాలనుకునే వారికి కొన్ని అర్హతలు ఉండాలని కేంద్రం కొన్ని నిబందణలు పెట్టింది. ఈ అర్హతలలో ఒకటి కనీసం ఒక ఎకరం భూమి యాజమాన్యం. అదనంగా, దరఖాస్తు ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులు వివిధ సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కోళ్ల ఫారానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి, దాన్ని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అధికారులకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి.
ఇది కూడా చదవండి..
Share your comments