Government Schemes

ప్రముఖ పోస్ట్ ఆఫీస్ స్కీం లు మరియు వాటి వడ్డీ రేట్లు !

Srikanth B
Srikanth B

పోస్ట్ ఆఫీస్ అందించే స్కీం లు చిన్న మరియు మధ్య తరగతి రైతు కుటుంబాలలో చాల ప్రసిద్ధి చెందాయి , బయట తో పోలిస్తే భద్రత పరం గ పోస్ట్ ఆఫీస్ స్కీం లు చాల సురక్షితం మైనవి గ పేరు పొందాయి . పోస్ట్ ఆఫీస్ అందించే స్కీం లు చాల సురక్షితం అయితే వాటి యొక్క వడ్డీ రేట్లు ఇళ్ల ఉన్నాయి .

ప్రముఖ పోస్టాఫీసు పొదుపు పథకాలు:

పొదుపు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లు, టైమ్ డిపాజిట్లు, జాతీయ పొదుపు నెలవారీ ఖాతాలు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సుకన్య సమృద్ధి, జాతీయ పొదుపు సర్టిఫికేట్లు, మరియు కిసాన్ వికాస్ పాత్ర ఇవన్నీ ప్రముఖ పోస్టాఫీసు పొదుపు పథకాలు.

  • పోస్టాఫీసు పథకాలపై వడ్డీ రేటు
  • పోస్టాఫీసు పొదుపు ఖాతా పై వడ్డీ రేటు 4%, వార్షిక కాంపౌండింగ్ తో.
  • ఒక సంవత్సరం ఫిక్స్  డిపాజిట్  పై త్రైమాసిక కాంపౌండింగ్  5.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • రెండు సంవత్సరాల ఫిక్స్  డిపాజిట్ పై  5.5 శాతం వడ్డీ రేటు  అందిస్తుంది.
  • మూడు సంవత్సరాల ఫిక్స్   డిపాజిట్ పై  త్రైమాసిక కాంపౌనింగ్ ఫ్రీక్వెన్సీతో 5.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • ఐదు సంవత్సరాల ఫిక్స్   డిపాజిట్  పై  6.7% వడ్డీ రేటు మరియు త్రైమాసిక కాంపౌనరీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
  • ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ పథకం పై   త్రైమాసిక కాంపౌండింగ్ తో 5.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం  పై త్రైమాసిక కాంపౌండింగ్ తో  7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • నెలవారీ ఆదాయ పథకం పై  5.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • జాతీయ పొదుపు సర్టిఫికేట్ వార్షిక కాంపౌండింగ్  తో 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం  పై వార్షికంగా కాంపౌండింగ్ తో 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • కిసాన్ వికాస్ పాత్రా పై  వార్షికంగా 6.6శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • సుకన్య సమృద్ధి పథకం పై  వార్షికంగా  6.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ స్కీం ముఖ్యమైన అప్ డేట్

2021-22 జనవరి-మార్చి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలు లేదా పోస్టాఫీసు పథకాలపై వడ్డీరేట్లను మార్చకుండా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ 31, 2021 లో  సర్క్యులర్ ద్వారా ఈ ప్రకటన జారీ చేసింది.

మార్చి 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) మరియు సుకన్య సమృద్ధి యోజన (ఎస్ ఎస్ వై) వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడిదారుల కు గత త్రైమాసికం లో లభించిన వడ్డీ రేటు మాత్రమే లభిస్తుంది .

సర్క్యులర్ ప్రకారం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) 2021-22 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 7.10 శాతం  వడ్డీ కొనసాగిస్తుందని తెలిపింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం (ఎస్ సిఎస్ ఎస్) 7.40% వడ్డీ  కొనసాగిస్తుంది, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 5.5-6.70% , ఈ వడ్డీ రేట్లు జనవరి 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటాయి.

Share your comments

Subscribe Magazine