ప్రముఖ భీమా సంస్థ అయిన ఎల్ఐసి ప్రజల కోసం అనేక భీమా పథకాలను అందుబాటులోకి తీసుకువస్తు ఉంటుంది. ఈ పాలసీలు ప్రజలకు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. వృద్ధుల కొరకు సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం అని, ఎల్ఐసి జీవం ఉమాంగ్ అని వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ విధంగానే 'ఎల్ఐసి ధన్ వర్ష' పేరుమీదుగా ఒక పథకాన్ని అందుబాటిలోకి తీసుకువచ్చింది. ప్రజలకు ఈ పాలసీ కూడా ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది.
ఈ ధన్ వర్ష పాలసీని తీసుకోడం వలన పాలసీదారుడికి పొదుపుతో పాటు రక్షణ కూడా పొందవచ్చును. ఈ భీమా పథకం అనేది నాన్- లింక్డ్, సేవింగ్స్, ఇండివిడ్యువల్, మరియు నాన్- పార్టిసిపేటివ్. పైగా ఇది క్లోస్డ్ ఎండెడ్ ప్లాన్. ఈ పాలసీని తీసుకోవడం వలన, ఒకవేళ ఆ పాలసీదారుడు అకాలంగా మరణిస్తే , వారి కుటుంబానికి ఈ పాలసీ ద్వారా ఆర్ధిక సహాయం అందుతుంది. ఈ పాలసీ టర్మ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది.
ఒకవేళ పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో అంగ వైకల్యం వస్తే, నెలల వాయిదాల్లో 10 సంవత్సరాల్లో చెల్లించవలసిన మొత్తాన్ని పొందవచ్చు. ఈ పాలసీ ప్లాను ఎల్ఐసి ఏజెంట్స్ ద్వారా పొందవచ్చు లేదా ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ధన్ వర్ష పాలసీ టర్మ్ 10 ఏళ్లకు మరియు 15 ఏళ్లకు ఉంది. ఈ పాలసీ ప్లాన్ విక్రయాలు అనేది మర్చి, 31, 2023తో ముగియనున్నాయి.
ఇది కూడా చదవండి..
ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు రూ. లక్ష..ఎల్ఐసి కొత్త పాలసీ
ఈ ధన్ వర్ష పథకానికి రూ.1,25,000 అనేది కనీస హామీ మొత్తం కింద ఇన్వెస్ట్ చేయాలి. దీనికి గరిష్ట హామీ మొత్తం లేదు ఎంత వరకైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. కనీస మెచ్యూరిటీ వయస్సు వచ్చేసి 18 ఏళ్ళు ఉండాలి. ఒకవేళ పాలసీదారుడు 15 ఏళ్ల కాలపరిమితి పాలసీని పొందాలి అనుకుంటే దానికి కనీస వయస్సు 3 ఏళ్ళు ఉండాలి, లేదా 10 ఎళ్ల కాలపరిమితి పాలసీని పొందాలి అనుకుంటే కనీస వయస్సు 8 ఏళ్ళు ఉండాలి.
పాలసీ యొక్క పూర్తి కాలపరిమితి పూర్తి అయినా తర్వాత పాలసీదారుడు బేసిక్ హామీ మొత్తన్ని పొందే అవకాశం కలుగుతుంది. పాలసీదారుడు అనుకోని పరిస్థితుల్లో కనుక పాలసీని రద్దు చేసుకుంటే నిబంధనల ప్రకారం అప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని అందిస్తారు. ఈ పాలసీతో ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి..
Share your comments