తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలుచేస్తామన్న, ఆరు గ్యారంటీలను, ఒకటొకటిగా అమలుచేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెల 2500 రూపాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ పథకం ఎప్పటనుండి అమలుచేస్తారని నిలదీయగా, ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉనందున, ఎలక్షన్స్ పూర్తికాగానే ఈ పథకం అమలుచేస్తారని తెల్సుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తుంది. గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్లవరకు కరెంటు ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిమితిని 10లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది.
అయితే 2500 రూపాయిలు పొందడానికి, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే సందేహం ఉంటుంది. మహాలక్క్ష్మి పథకం కింద ప్రతీ నెల 2500 రూపాయిలు పొందేందుకు, ఆఫ్లైన్ లో లేదా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతీ కుటుంబంలోని ఇంటి పెద్ద మహిళకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలు, టాక్స్ చెల్లిస్తున్న మహిళలు ఈ స్కీం పొందేందుకు అనర్హులు. ఈ స్కీంకు అప్లై చేసుకోవడానికి మీ రేషన్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పాస్ బుక్ నెంబర్ అవసరం. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకునేవారు, సేవ సింధు గ్యారంటీ స్కీం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ మహాలక్ష్మి యోజన మీద క్లిక్ చేసి, అడిగిన వివరాలను నింపి సబ్మిట్ చెయ్యాలి. ఈ పోర్టల్ ద్వారా సులభంగా ఈ స్కీంకు రిజిస్టర్ అవ్వచ్చు.
Share your comments