వినుత్నమైన మరియు సుస్థిర పశు పాలనా విధానాలకు నాంధి పలకనున్న నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కొత్త విధానాలు. NLM అంటే ఏమిటీ ఈ మిషన్ రైతులకు ఎలా ఉపయోగ పడుతుందో ఇప్పుడు తెల్సుకుందాం.
2014-15 ఆర్ధిక సంవత్సరంలో , కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక,పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(NLM ) ప్రారంభించబడింది. పాడి మరియు పశు వ్యవసాయం నుండి వచ్చే ఉత్పత్తుల నాణ్యతను, పరిమాన్ని పెంచడం కోసం ఈ స్కీం ని ప్రవేశపెట్టారు. దానితో పాటు, పాడి రైతుల ఆదాయాన్ని పెంచే దిశలో ఈ స్కీం ముందుకు సాగుతుంది. 2021 లో పునర్వ్యవస్థీకరణకు, కాబినెట్ కమిటి ఆన్ ఎకనామిక్స్ అఫైర్స్ ద్వారా ఆమోదం పొంది, ఈ మిషన్ అభివృద్ధికి 23000 కోట్ల రూపాయిలు అందుకుంది. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలను, లక్ష్యాలను తెల్సుకుందాం రండి.
నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ముఖ్యమైన లక్ష్యాలు:
మేత లబ్యత పెంపొందించడం:
అత్యంత పాడి లభ్యత ఉన్న మన దేశములో తరచు మేత కొరత ఏర్పడుతూ ఉంటుయింది. సరైన విత్తనాల లబ్యత, మరియు బలహీనమైన పంట పంటకోత విధానాలు మేత కొరతకు ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించి, మేతకు అవసరం అయ్యే మొక్కల విత్తనాలు పెంపొందించి మంచి దిగుబడి వచ్చేలా చేయడం, హార్వెస్టింగ్ పద్ధతులకు అవసరం అయ్యే మెషినరీ ని అందించడం లో ఈ మిషన్ కీలక పాత్ర పోషిస్తుంది.
మేత ఉత్పత్తిని అధికం చేయడం:
పైన చర్చించిన విధంగా అధిక మేత ఉత్పత్తి లో భాగంగా, రైతులను, పాడి యజమానులు, రైతు సహకార సంఘాలను, ప్రైవేట్ విత్తన పరిశ్రమలను ఒక్కటిగా చేసి మేత అందుబాటును పెంచడం.
కలసి కట్టుగా ముందుకు సాగడం:
మిషన్ స్కీం లో భాగంగా ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళికలను అనుసరిస్తూ, భాగస్వాలు అందరు సుస్థిర నిర్వహణ పద్దతులు పాటించేలా చెయ్యడానికి NLM చర్యలు పాటిస్తుంది.
పరిశోధన విధానాలు బలపరుచుకునే విధంగా ప్రోత్సహించడం :
జంతు పోషణ, పశువుల ఉత్పాదన పెంపొందించే పరిశోధన విధానాలు బలపరచడం ఈ మిషన్ యొక్క అతి కీలకమైన అంశాలు.
నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంకేతికతను వ్యాప్తి చెయ్యడం.
పాడి రైతులకు అవసరం అయ్యే శిక్షణను ఇస్తూ, ఈ రంగంలోకి అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతికతను ఎల్లపుడు తెలియచేస్తూ, ఉత్పతతి కి అవసరం అయ్యే ఖర్చును తగ్గించి, దిగుబడిని పెంచడం.
స్వదేశీ రకాలను కాపాడుకోవడం :
మన వాతావరణానికి అనువుగా ఉంటూ మంచి దిగుబడిని ఇచ్చే మన స్వదేశీ రకాలను కోపాడుకోవడం ఎంతో అవశ్యం. రైతులు మరియు ఇతర సహకార సంగాల సహాయంతో ఈ పని సాధ్యం అవుతుంది.
రోగాల నియంత్రణ, పర్యావరణ సుస్థిరత.
పశువుల్లో వచ్చే రోగాలకు సరియిన సమయంలో నియంత్రన చర్యలు పాటిస్తూ. మరియు పర్యావరణహితంగా, ఉత్పత్తిలో నాణ్యతను పెంచడం ఈ మిషన్ ముఖ్య ఆదేశాలు.
Share your comments