Government Schemes

వైఎస్సార్‌ కల్యాణమస్తు దరఖాస్తుకు ఇప్పుడు 30 రోజులే గడువు .. !

Srikanth B
Srikanth B

ఆంధ్రప్రదేశ్ పేదలకు వివాహ కానుకగా అందించే పథకం వైఎస్సార్‌ కల్యాణమస్తు ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు వార్షిక ఆదాయం 2. 5 లక్షలు కల్గిన వారి కుమార్తె వివాహానికి 50,000 ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ప్రభుత్వం .

అయితే గతంలో 6 నెలల గడువు ఇచ్చేది .. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు వివాహమైన తర్వాత 60 రోజుల వరకు గడువిస్తుండగా తాజాగా దాన్ని 30 రోజులకు కుదించింది. ఈ నెల 6వ తేదీనే సాంఘిక సంక్షేమశాఖ ఈ ఉత్తర్వులను విడుదల చేసినా అంతర్గతంగా మాత్రమే సంబంధిత శాఖలకు పంపింది. చాలా గ్రామ, వార్డు సచివాలయాలకు మాత్రం ఆ సమాచారం చేరలేదు.

దీంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వివాహం చేసుకున్న కొంతమంది.. దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్తుంటే అధికారులు గడువు ముగిసినట్లు చెబుతున్నారని వాపోతున్నారు.

12 వేలకు పెంచనున్న పీఎం కిసాన్.. వార్తల్లో నిజమెంత !

YSR కళ్యాణమస్తు పథకం కోసం దరఖాస్తు చేయడానికి, కింది పత్రాలు అవసరం:

వధూవరుల ఆధార్ కార్డు

వధూవరుల వయస్సు రుజువు (10వ తరగతి సర్టిఫికేట్ లేదా జనన ధృవీకరణ పత్రం)

వధువు తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం (తహశీల్దార్ జారీ చేసినది)

వధూవరుల కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)

వివాహ కార్డు లేదా ఆహ్వానం

వధువు తల్లి లేదా తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు

పైన తెలుపబడిన ధ్రువ పత్రాలను కల్గిన వారు https://ysrkalyanamastu.ap.gov.in/. అధికారిక వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .

12 వేలకు పెంచనున్న పీఎం కిసాన్.. వార్తల్లో నిజమెంత !

 

Related Topics

ysr aasara YSR Bima

Share your comments

Subscribe Magazine