కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. అందులో రైతుల సంక్షేమం కోసం అందించే స్కీమ్ చాలానే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అందులో చెప్పుకోవాల్సింది ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం మాన్ ధన్ యోజన వంటి పథకాలు. ఈ రెండు పథకాలు .. దేశ వ్యాప్తంగా అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 6 వేలు జమవుతాయి. ప్రతి సంవత్సరం ఈ డబ్బులను అందించనుంది. కానీ ఇవి ఒకేసారి కాకుండా.. విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమవుతాయి. ప్రతి విడతలో రూ.2 వేలు చొప్పున వస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం 8 విడతలలో డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమచేసింది. ఆన్‌లైన్‌లోనే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరే ఇంట్లో నుంచే పథకంలో చేరే అవకాశముంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, పొలం పట్టా వంటివి ఉంటే సరిపోతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి.
అలాగే పీఎం కిసాన్ పథకంలాగే పీఎం మాన్ ధన్ పథకం కూడా ఒకటి ఉంది. ఈ పథకం ద్వారా ప్రతి నెల రూ. 3 వేలు లభిస్తాయి. అంటే 12 నెలలకు కలిపితే.. సంవత్సరానికి రూ. 36 వేలు వస్తాయి. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద నమోదు చేసుకున్న ఏ రైతు అయినా కిసాన్ మన్ ధన్ యోజన నుండి లబ్ది పొందవచ్చు. ఈ పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద నమోదు చేసుకున్న 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలవారీ పెన్షన్ రూపంలో ఆర్థిక భరోసా అందిస్తుంది. అయితే ఈ పథకంలో చేరాలనుకునే రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకంలో చేరి ఉండాలి. అలాగే వారికి రెండు హెక్టార్లలోపు సాగుభూమి ఉండాలి. ఇందులో చేరడానికి ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. అంతేకాదు.. ఈ పథకంలో చేరిన రైతులు కొంత అమౌంట్ పెట్టుబడిగా చెల్లించాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసు వారు ఈ పథకంలో చేరోచ్చు. 10 సంవత్సరాలు నిండినవారు ప్రతి నెలా రూ. 55 కట్టాలి. అలాగే 0 ఏళ్ల వయసులో చేరితే రూ.110 చెల్లించాలి. 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.200 కట్టాలి. 60 ఏళ్ల తర్వాతి నుంచి మీకు నెలకు రూ.3 వేలు వస్తాయి.
Share your comments