కేంద్రం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కొన్ని స్కీమ్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీఎం కిసాన్ స్కీన్ గురించి. ఇప్పటికే కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చి 30 నెలలు పూర్తయ్యింది.
ఇప్పటివరకు కేంద్రం అందించిన పథకాలలో విజయవంతగా దూసుకుపోతున్న స్కీమ్ ఇదే. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా దేశంలో అర్హులైన రైతులకు కేంద్రం రూ. 6 వేలు ఇస్తోంది. అయితే ఇవి ఒకేసారి రైతుల అకౌంట్లోకి చేరవు. విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమవుతాయి. ప్రతి విడతలో రూ.2 వేలు చొప్పున వస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం 8 విడతలలో డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమచేసింది.
ఇక కేంద్రం 9 వ విడత డబ్బులను కూడా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఆగస్టు నెలలో వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. పీఎం కిసాన్ స్కీమ్ మాదిరిగానే ప్రభుత్వం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటి అందిస్తుంది. దీని ద్వారా రైతులకు ప్రతి నెల రూ. 3 వేలు లభిస్తాయి. అంటే ఏడాదికి రూ. 36 వేలు వస్తాయి. ఈ డబ్బులకు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా వచ్చే రూ. 6 వేలు కలిపితే మొత్తం రూ. 42 వేలు సంవత్సరానికి రైతుల ఖాతాల్లోకి వస్తాయి.
కానీ పథకంలో చేరే రైతులు ప్రతి నెల కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెలకు రూ. 55 నుంచి రూ. 200 వరకు కట్టాల్సి ఉంటుంది. ఇందులో 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ లోపు వయసు ఉన్నవారు చేరొచ్చు. ఇక 18 ఏళ్ళ వారు నెలకు రూ. 55 కట్టాలి. అలాగే 30 ఏళ్ళ వయసు వారు రూ. 110 చెల్లించాలి. ఇక 40 ఏళ్ళ వయసు ఉన్నవారు రూ.200 కట్టాలి. 60 ఏళ్ల తర్వాత నుంచి నెలకు రూ.3 వేలు వస్తాయి. కానీ ఈ డబ్బులు పీఎం కిసాన్ స్కీమ్ లో చేరిన వారికి మాత్రమే లభిస్తాయి. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంకా పీఎం కిసాన్ యోజన స్కీమ్ లో చేరని వారుంటే.. తొందరగా రిజస్టర్ చేసుకోవడం మంచిది.
Share your comments