Government Schemes

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు 10 లక్షల సహాయం!

S Vinay
S Vinay

కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద నిధులను విడుదల చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిల్లల కోసం పీఎం కేర్స్ పథకం కింద ప్రయోజనాలను విడుదల చేశారు.స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, క‌రోనా వ‌ల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధను మాటలతో చెప్పడం కష్టం అని తాను ప్రధానిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు.పిల్లల కోసం PM కేర్స్ అనేది పిల్లల కష్టాలను తగ్గించడానికి ఒక చిన్న ప్రయత్నం అని వ్యాఖ్యానించారు.

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పధకంలో భాగంగా 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ కింద స్కాలర్ షిప్స్, పిల్లలకు ఆయుష్మాన్ కార్డ్ ద్వారా వైద్య సదుపాయం , పీఎం కేర్స్ పాసు పుస్తకాలు మొదలైనవి అందించనున్నారు. ఇతర రోజువారీ అవసరాలకు, ఇతర పథకాల ద్వారా వారికి ప్రతినెలా 4 వేల రూపాయలకు అందేట్లు ఏర్పాట్లు చేశారు. బాధిత చిన్నారులపేరిట రూ.10 లక్షల సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. 18నుండి 23 ఏళ్ల మధ్యలో ఆ డిపాజిట్ నగదు పై వచ్చిన వడ్డీని వారికి ఆర్ధిక సాయంగా ఇవ్వనున్నారు. చివరగా 23 ఏళ్ళు నిండిన తరువాత ఆ రూ. పది లక్షలను పూర్తిగా బాధిత చిన్నారులకి ఇవ్వనున్నారు. అంతే కాకుండా చిన్నారులని మానసిక రకమైన సహాయం కొరకు సంవాద్ హెల్ప్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వబడుతుంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, పలువురు మంత్రుల మండలి సభ్యులు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

మరిన్ని చదవండి.

కిసాన్ క్రెడిట్ కార్డు లాభాలు...దరఖాస్తు చేయడం ఎలా?

లోన్ యాప్ సంస్థల రాక్షస చేష్టలు...ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి దగ్గర అప్పు తీసుకోకండి!

Share your comments

Subscribe Magazine